సినిమాలను అనుకున్న టైంలో తీసి చూపించడంలో మేటి దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. సంవత్సరాలు సంవత్సరాలు సినిమాలు తీస్తున్న ఈ జెనెరేషన్లో స్టార్ హీరో అయినా, కుర్ర హీరో అయినా ముచ్చటగా మూడు నెలల్లో సినిమా మడతెట్టేస్తాడు పూరి. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘లోఫర్’ సినిమా తుది మెరుగులు దిద్దుతున్న పూరి తన తర్వాత సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ముందు ఎనౌన్స్ చేసిన విధంగానే ఇషాన్ అనే కొత్త కుర్రాడు హీరోగా తెలుగు, కన్నడ బైలింగ్వల్ చేస్తున్న పూరి ఆ సినిమాలో అప్సరస లాంటి హీరోయిన్స్ ని ఓకే చేశాడట.
ధనుష్ ‘అనేకుడు’ సినిమాతో సౌత్ సిని ప్రేక్షకులను అలరించిన అమ్యర దస్తర్ కొద్దిరోజుల క్రితం ఆ సినిమాలో ఉంది, ఈ సినిమాలో సెలెక్ట్ అయ్యింది అని హడావిడి చేశారు తీరా చూస్తే అవన్నీ రూమర్లే అని తేలాయి. పూరి మాత్రం ఇషాన్ సరసన అమ్య్రరను హీరోయిన్ గా ఫైనల్ చేశాడట. అయితే కథ పరంగా సినిమాలో ఇంకో హీరోయిన్ అవసరముండగా మరో భామని కూడా సెలెక్ట్ చేశాడట. పూరి మార్క్ టేకింగ్ తో రాబోతున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సినిమాతో స్ట్రైట్ సినిమా గా అమ్యరకి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు.. టాలీవుడ్లో ఓ సినిమా సక్సెస్ అయితే వరుస ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం పూరి మాత్రం రిలీజ్ కి సిద్ధమవుతున్న ‘లోఫర్’ గురించి ఎక్కువ కాన్సెంట్రెట్ చేస్తున్నాడు. లోఫర్ రిలీజ్ అయ్యాక ఏమాత్రం లేట్ చేయకుండా ఇషాన్ సినిమాను పట్టాలెక్కించాలని ప్రయత్నం చేస్తున్నాడు. సినిమా గురించి మరిన్ని డీటేల్స్ త్వరలో తెలిసే అవకాశం ఉంది.