పూరితో సినిమా అంటే చకాచక్… ఫటాఫట్. ఎప్పుడు కథ రాశాడో, ఎప్పుడు కొబ్బరికాయ కొట్టాడో, ఎప్పుడు పూర్తి చేశాడో కూడా తెలియకుండానే సినిమాని బయటకు తీసుకొచ్చేస్తాడు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకి రంగం సిద్ధం చేయడం కూడా పూరికి అలవాటు. ఇప్పుడు రామ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అదే ఇస్మార్ట్ శంకర్. దీనికి సీక్వెల్ చేయాలన్న ఆలోచన వచ్చేసింది పూరికి. అనుకున్నదే తడవుగా `డబుల్ ఇస్మార్ట్` అనే టైటిల్‌కి పూరి రిజిస్టర్ చేయించేశాడు. ఇప్పటి వరకూ వచ్చిన అవుట్ పుట్ పై అటు పూరి, ఇటు రామ్ పూర్తి సంతృప్తితో ఉన్నారని, అందుకే.. అప్పుడే సీక్వెల్ కోసం సన్నాహాలు మొదలెట్టేశారని టాక్. ఓ సినిమా విడుదలై, హిట్టయితే.. సీక్వెల్ గురించి ఆలోచిస్తారు. కానీ.. పూరికి అంత టైమ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. అందుకే.. సగం సినిమా షూటింగ్ అవ్వకముందే… సీక్వెల్ ఆలోచనలో పడ్డాడు. ఇది కాన్ఫిడెన్సా?? ఓవర్ కాన్ఫిడెన్సా?? అనేది.. `శంకరే` తేల్చి చెప్పాలి.