‘లూసిఫర్’ సినిమాని డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పటివరకు రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చాడు. అయితే ఈ రెండు భాగాల్లో కూడా మోహన్ లాల్ ఎవరు ? అతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఏం చేస్తుంటాడు? ఎవరి కోసం పని చేస్తుంటాడు? అనేది ప్రశ్నగానే ఉంచారు.
తాజాగా వచ్చిన రెండో భాగంలో అసలు స్టీఫెన్ నడుంపల్లి (మోహన్ లాల్) పాత్ర ఎక్కడి నుంచి మొదలైందో చివర్లో ఒక గ్లిమ్స్ లాగా చూపించాడు. స్టీఫెన్ క్యారెక్టర్ లో మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ కనిపించడం ముఖ్యంగా మలయాళం అభిమానులని అలరించింది. ఇప్పుడు మూడో భాగం తీయడానికి సుకుమారన్ రెడీ అవుతున్నాడు.
అయితే ఈ మూడో భాగంలో ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా కనిపిస్తారని సమాచారం. స్టీఫెన్(ప్రణవ్) ముంబై సామ్రాజ్యాన్ని, అక్కడ మాఫియాని శాసించడం, తర్వాత కొన్నాళ్ళకి పెరిగి పెద్దయ్యాక ఆ పాత్రలో మళ్లీ మోహన్ లాల్ కనిపిస్తారని తెలుస్తుంది. దాదాపు మూడో భాగంలో ప్రణవ్ మోహన్ లాల్ పాత్రే అధికంగా ఉంటుంది. చివర్లో మోహన్ లాల్ కనిపిస్తారని సమాచారం.
ప్రణవ్ మోహన్ మల్టీ ట్యాలెంటెడ్. బాల నటుడిగా పరిచయం అయ్యాడు. మంచి సింగర్. పాటల రచయిత. పలు సినిమాలకి సహాయ దర్శకుడిగా కూడా పని చేశాడు. ఇప్పుడు లూసిఫర్ 3 అతనికి క్రేజీ ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ వుంది.