రాహుల్ గాంధీ పౌరసత్వంపై… కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరి సమాచారాన్ని క్షణాల్లో.. తెప్పించుకోగల సామర్థ్యం ఉన్న కేంద్ర హోం శాఖ అధికాకారులు.. విచిత్రంగా.. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు చేశారంటూ… రాహుల్ గాంధీకి.. ఓ నోటీసు పంపారు. రెండు వారాల్లో… సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఇంకా విశేషం ఏమిటంటే.. ఆ నోటీసులో ఉన్న సమాచారం ప్రకారం..రాహుల్ గాంధీ.. తన పౌరసత్వాన్ని ఆయన నిరూపించుకోవాలన్నట్లుగా… నోటీసు ఉంది. ఇది రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. రాహుల్ గాంధీ పేరు రౌల్ విన్సీ అని.. ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం ఉందని సుబ్రహ్మణ్యస్వామి .. ఓ ఫిర్యాదును కేంద్రహోంమంత్రిత్వ శాఖకు పంపారు. గతంలో… లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్కూ.. ఇలాంటి ఫిర్యాదే చేశారు.
ఇటీవల అమేథీలో.. నామినేషన్ వేసేటప్పుడు కూడా..కొంత మంది.. ఇదే అంశాన్ని లేవనెత్తారు. రెండు రోజుల పాటు..పరిశీలనలో ఉంచిన రాహుల్ నామినేషన్ ను.. తాను ఇండియన్ అనడానికి సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించడంతో.. ఆమోదించారు. కానీ..రాహుల్ గాంధీని… హోంమంత్రిత్వ శాఖ మరో విధంగా టార్గెట్ చేసింది. ఈ వివాదంపై..ప్రియాంక గాంధీ స్పందించారు. ఇదో రాజకీయ జిమ్మిక్ అన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడ పుట్టారో…దేశం మొత్తానికి తెలుసన్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో..కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు ఇలాంటి నోటీసులు జారీ చేయడం… రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.
జాతీయ వాదాన్ని హైలెట్ చేసుకుంటూ.. తామే దేశభక్తులమని చెప్పుకునేందుకు బీజేపీ హడావుడి పడుతున్న సమయంలో.. రాహుల్ గాంధీ భారతీయుడు కాడన్నట్లుగా… ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతోనే.. ఈ నోటీసులు జారీ చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. దేశ రాజకీయం.. ఎప్పుడూ లేనంత భిన్నకోణాల్లో సాగుతోందని.. రాహుల్ కు వచ్చిన నోటీసుల ద్వారా అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది.