సన్నీలియోన్ పేరు చెబితే ఇప్పుడు కర్నాటక వాళ్లు భగ్గుమంటున్నారు. తమ ప్రాంతంలో సన్నీలియోన్‌ని తిరగనివ్వం.. ఆమె వస్తే.. సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతాం అంటూ ఓ వర్గం హెచ్చరిస్తోంది. కర్నాటక ప్రజలు సన్నీలియోన్ పై ద్వేషం పెంచుకోవడానికి ప్రత్యేకమైన కారణాలేం లేవు. అక్కడ డిసెంబరు 31 న ‘సన్నీ నైట్స్’ పేరిట ఓ ప్రైవేటు సంస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొత్త యేడాదిని స్వాగతం పలుకుతూ సన్నీ డాన్స్ చేయబోతోంది. ఈ కార్యక్రమంలో సన్నీ పాల్గొనేది అరగంట సేపే. దానికి గానూ ఆమెకు రూ.50 లక్షల పారితోషికంతో పాటు ఆమె సిబ్బందికి రూ.10 లక్షల వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పార్టీకి సంబంధించిన టికెట్లు కూడా జోరుగా అమ్ముడైపోతున్నాయి.
సన్నీ లియోన్ బ్లూ ఫిల్మ్స్‌లో నటించిన తార. ఆమె ఇక్కడ వచ్చి, అభ్యంతరకరమైన రీతిలో, అర్థనగ్నంగా నృత్యాలు చేస్తానంటే ఒప్పుకోం. ఆమె కట్టుకుని బుద్దిగా ఉంటానంటే తప్ప.. రానివ్వం.. అంటూ ఓ వర్గం నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియెస్‌గా తీసుకొంది. సన్నీ షోని రద్దు చేయాలని నిర్వాహకుల్ని ఆదేశించింది. అయితే నిర్వాహకులు మాత్రం ”సన్నీ కేవలం డాన్స్ చేయడానికే వస్తోంది. షోలో ఎలాంటి అభ్యంతర కరమైన పనులూ చేయం” అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం ఈ షోని రద్దు చేసినా – టికెట్ల అమ్మకం జోరుగా కొనసాగుతుండడం విశేషం.