మేం పౌరసత్వం నిరూపించుకోవాలా..?
ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇది. ఈ ప్రశ్న నుంచి పుడుతున్న ఆందోళనే… దావానలంలా.. ఆందోళనల రూపంలో విస్తృతమవుతోంది. ఈ ఆందోళన ఒక్క ముస్లింలలోనే కాదు.. హిందువులలోనే ఏర్పడింది. దీనికి కారణం ప్రభుత్వాలపై నమ్మకం లేకపోవడం. పుట్టుకను కూడా.. పత్రాలతో నిరూపించుకోవడం.. అంటే.. అది .. ఈ ప్రజలకు అవమానం లాంటిదే. ఈ దేశంలో 90 శాతం మంది తాము పుట్టిన ఊరును.. జిల్లాను దాటి ఉండవు. వలసలుపోయేవాళ్లు.. ఆయా రాష్ట్రాల రాజధానులు లేకపోతే.. దగ్గరున్న సిటీల వరకూ వెళ్తారు. అంతకు మించిన ప్రపంచం.. ఈ దేశ ప్రజలకు తెలియదు. అలాంటి వారందరికీ ఇప్పుడు తాము పౌరసత్వాన్ని నిరూపించుకోవాలా.. అన్న ఆందోళన వెంటాడుతోంది.
హిందువులు అందరికీ.. పౌరసత్వం ఉంటుంది..మీరెవరూ భయపడకండి.. అని బీజేపీ నేతలు సోషల్ మీడియాలో ఇతర మాధ్యమాల్లో .. ఇతర చోట్ల చేస్తున్న ప్రచారం.. భరోసా పెంచకపోగా.. మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అసలు.. ప్రశ్నే రాని చోట.. భద్రత అనే మాట రావడమే దీనికి కారణం. ప్రభుత్వాలు చేసిన పనులపై.. ఇప్పటి వరకూ ప్రజలకు సరైన అభిప్రాయం లేదు. ఆధార్ కార్డు దగ్గర్నుంచి పాన్ కార్డు వరకూ… పదుల సంఖ్యలో గుర్తింపు కార్డులు ప్రజలకు ఉన్నాయి. కానీ ఏ ఒక్క కార్డు… సులువుగా ఇవ్వలేదు. అనేక కష్టాలు పడితేనే వచ్చింది. అంతకు మించి.. ఆ కార్డుల వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ కావు. స్పెల్లింగ్ మిస్టేక్స్ మొదలుకుని… ఆడ్రస్ మార్పుల వరకూ… ప్రజల ఇప్పటికీ.. ఆ కార్డుల వ్యవహారంలో ప్రభుత్వాలను తిట్టుకుంటూనే ఉంటారు.
ఇప్పుడు ఇక్కడే పుట్టి పెరుగుతూ.. ఇప్పుడు.. ఈ దేశంలోనే.. తాము పౌరసత్వం నిరూపించుకోవాలనుకునే పరిస్థితి రావడమే.. అందర్నీ… ఆందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి పరిస్థితి కలలో కూడా వద్దని హిందువులు కూడా భావిస్తున్నారు. ఎంత ముస్లిం బూచిగా చూపించినప్పటికీ.. ప్రజలు రియలైజ్ అయ్యే పరిస్థితి లేదు. పౌరసత్వ బిల్లు, ఎన్నార్సీ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో… కేంద్రం అనుసరించిన తప్పుడు స్ట్రాటజీతోనే.. ప్రస్తుత మంటలు రేగుతున్నాయి. దీన్ని ఆపే బాధ్యత కూడా కేంద్రానిదే.