అన్న జగన్మోహన్ రెడ్డితో చెల్లి షర్మిల విబేధించిందని ఆయనకు పోటీగా పార్టీ పెట్టబోతోందని .. ప్రముఖ తెలుగు మీడియా గ్రూపు ఆంధ్రజ్యోతి అదే పనిగా ప్రచారం చేస్తోంది. దీన్ని చాలా మంది నమ్మడం లేదు. అయితే…ఈ ప్రచారంలో ప్రధానంగా వస్తున్నది జగన్‌తో ఆమె గొడవపడ్డారని కుటుంబంతో విడిపోయేందుకు సిద్ధమయ్యారనేది కీలకంగా ఉంది. ఈ ప్రచారంపై… వైఎస్ కుటుంబం నుంచి ఒక్కటంటే.. ఒక్క స్పందన కూడా రాలేదు. చివరికి చిన్న చిన్న విషయాలపై …. బూతులతో విరుచుకుపడే వైసీపీ సోషల్ మీడియా టీం కూడా.. దీనిపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. దీంతో… వైఎస్ కుటుంబంలో నిజంగానే గొడవలున్నాయన్న చర్చ ప్రారంభమవుతోంది.
వైసీపీ నేతలు షర్మిల రాజకీయ పార్టీపై క్లూ లెస్‌గా ఉన్నారు. ఏంమాట్లాడితే ఏం వస్తుందో అన్న సందేహంతో చాలా మంది మాట్లాడటం లేదు. నిజానికి వైసీపీలో ఏం మాట్లాడాలన్నదానిపై ఎవరికీ స్వేచ్చ లేదు. ఏం మాట్లాడినా… హైకమాండ్ నుంచి పాయింట్లో.. ప్రెస్ నోటో వస్తే తప్ప.. దానికి అనుగుణంగా మాట్లాడగలరు. లేకపోతే… నో కామెంట్ అన్నదానికే పరిమితం అవుతారు. షర్మిల అంశంపై ఎలా స్పందించాలో వైసీపీ హైకమాండ్ కూడా… ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో.. ఎవరికీ ఈ అంశంపై మాట్లాడాలన్న సందేశాలు వెళ్లలేదు. దీంతో ఎవరూ మాట్లాడలేదు.
నిజానికి షర్మిల లేదా… ఆమె సన్నిహితులు స్పందిస్తేనే… ఆ కథనాలకు ఖండన వచ్చినట్లవుతుంది. అలా కాకుండా,.. వైసీపీ ఇతర నేతలు స్పందిస్తే.. ఆ వివాదం మరింత పెరిగి పెద్దదవుతుంది. అయితే షర్మిల కానీ… ఇతర సన్నిహితులు కూడా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. చేయనప్పుడు.. తాము దాన్ని పెంచడం ఎందుకన్న అభిప్రాయంలో వైసీపీ పెద్దలున్నట్లుగా తెలుస్తోంది. షర్మిల రాజకీయ పార్టీ అంశంపై అంతర్గతంగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ అది సీరియస్ అని అనుకోలేదు. జగన్ కుటుంబంలో గొడవలు ఉన్నాయో లేవో…షర్మిల పార్టీ పెడుతుందో లేదో… ఫిబ్రవరి తొమ్మిదో తేదీన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఆరోజే… షర్మిల పార్టీ పెడతారని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చెప్పారు మరి..!