సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉంటూ.. రాత్రికి రాత్రి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయిపోయిన వెంకట్రామిరెడ్డి పై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆయన కన్ ఫర్డ్ ఐఏఎస్. తెలంగాణ ప్రభుత్వ పెద్దల మెప్పు పొంది కలెక్టర్ గా సుదీర్ఘ కాలం ఉన్నారు. ఆయన పదవిలో ఉంటూనే..కుటుంబ సభ్యులతో భారీ రియల్ ఎస్టేట్ బిజినెస్ నిర్వహిస్తూ ఉండేవారు. వారి సంస్థ పేరు రాజ్ పుష్ప. ఇప్పుడు ఆ రాజ్ పుష్ప సంస్థపై పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆ సంస్థకు సంబంధం ఉన్న ఇతర సంస్థల్లోనూ సోదాలు చేస్తున్నార.ు
వసుధ ఫార్మా, రాజు పుష్ప, వెరిటెక్స్ సంస్థలలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఫార్మా పేరుతో వ్యాపారం చేస్తూ.. రాని ఆదాయాన్ని చూపించి ..రహస్యంగా తీసుకొచ్చిన మొత్తం రియల్ ఎస్టేట్ సంస్థల్లోకి పెట్టుబడుల రూపంలోకి మళ్లించినట్లుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తంగా యాభై ప్రారంతాల్ల ోసోదాలు జరుగుతున్నాయి. భారీగా పన్నులు ఎగవేత మాత్రమే కాదు.. అసలు బ్లాక్ మనీ గుట్టు కూడా ఈ కంపెనీల నుంచి బయటపడుతుందని అంచనా వేస్తున్నారు.
కలెక్టర్ గా ఉంటూ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై గతంలో రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్ పుష్ప సంస్థకు పెద్ద ఎత్తున భూములను ప్రభుత్వం కట్టబెట్టిందని ఈ సంస్థ ప్రభుత్వ పెద్దలకు బినామీ అనే ఆరోపణలు కూడా చేశారు.వెంకట్రామిరెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల దర్యాప్తు సంస్థల దూకుడు కాస్త తగ్గినట్లు అనిపించింది కానీ.. ఈ సారి పెద్దగా హైలెట్ కాకుండా… కీలకమైన సంస్థలపై సోదాలు చేయడం సంచలనంగా మారింది.