నా జీతం ఏడాదికి కోటి రూపాయలు అని ఆ యువకుడు చెప్పుకున్నాడు. మీ స్ఫూర్తిగా పని చేసుకుంటున్నానని ఆ యువకుడు అన్నాడు. చంద్రబాబునాయుడు శభాష్ అని అభినందించారు. ఆ వీడియోపై వైసీపీ సోషల్ మీడియా ఇంకేం పని లేనట్లు ఆ కోటి సంపాదిస్తానన్న యువకుడిపై పడింది. ఎక్కడ్నుంచి సంపాదిస్తావు.. ఎలా సంపాదిస్తావు అంటూ ట్రోలింగ్ చేశారు. ఆయన సాదాసీదా డ్రెస్సింగ్ తో ఉన్నారు కాబట్టి ఐటీ ఉద్యోగి కాడని..కోటి జీతం రాదని తేల్చుకుని పోస్టులు పెట్టారు.
ఆ యువకుడు తన జీతభత్యాల గురించి ఆధారాలు కూడా పెట్టి.. ట్రోల్ చేసే వాళ్లకి షాక్ ఇచ్చాడు. డబ్బును బట్టి బిల్డప్ ఇవ్వాలని ఏమీ లేదు. డబ్బును ఎవరు చూసే ధృక్కోణంలో వారు చూస్తారు. ఏడాదికి రూ. కోటి వస్తాయని చెప్పి వెండికుర్చీలు చేయించుకుని కూర్చోరు కదా. అలా కూర్చునేవారికే కోటి వస్తాయంటే ఎలా నమ్ముతాం?. కానీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అదే భ్రమలో ఉన్నారు. కానీ పరువు పోగొట్టుకున్నారు.
ఎవరైనా కష్టపడి సంపాదిచుకుంటే వారిని అభినందించాలి..కానీ ఇలా చెప్పారని పనీ పాటా లేకుండా ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది?. ఎవరైనా లేని సంపాదనను బహిరంగంగా చెప్పుకుంటారా?. చెప్పుకున్నంత మాత్రాన అతనికి ఎవరైనా ఆ జీతం ఇస్తారా ?. ఇలాంటి విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేసి.. వైసీపీ సోషల్ మీడియా ప్రాధాన్యతలను
గుర్తించలేని స్థితికి వెళ్లిపోయిది. కోలుకునే అవకాశం కూడా కనిపించడం లేదు.