రాజకీయ అవసరాల కోసం.. టీడీపీ యాప్ సమాచారాన్ని దొంగిలించి.. వైసీపీకి ఇవ్వడం కోసమే.. ఐటీ గ్రిడ్‌పై కేసు పెట్టి.. ప్రజల వ్యక్తిగత సమాచారం అంటూ.. ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అసలు ఏపీ ప్రజల డేటా లీకయ్యే చాన్సే లేదని ఐటీ అధికారులు సాంకేతిక వివరాలతో సహా బయటపెట్టడంతో.. తమ అంతర్గత వ్యవహారాల్లో తెలంగాణ జోక్యం చేసుకుందని నిర్దారణకు వచ్చింది. రాజకీయంగా తేల్చుకుంటే.. ఈ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదని ప్రభుత్వ పరంగానే… ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఓ రాష్ట్ర డేటాపై.. మరో రాష్ట్రం కేసు పెట్టడం ఏ రాజ్యాంగ సూత్రాలకూ అతకదని.. ఫెడరల్ వ్యవ్యస్థలో ఇలాంటి ప్రయత్నం చేయడం… రాజ్యాంగ పరంగా.. చేసిన అతి పెద్ద తప్పు అని నిర్ణయానికి వచ్చారు. ఈ విషయంలో… తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ఎంత ముందుకు వెళ్తే అంత ఇరుక్కుపోతారు కాబట్టి.. వాళ్లను వీలైనంత ఎక్కువగా చర్యలు తీసుకునేలా వేచి చూడాలన్న వ్యూహం అమలు చేయాలని టీడీపీ భావిస్తోంది.
తెలంగాణకు చెందిన ఎంసెట్ పత్రాల లీకేజీ.. ఢిల్లీలో జరిగిందని… ఢిల్లీ ప్రభుత్వం .. తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెట్టిందా.. ? అన్న లాజిక్ న్యాయనిపుణులు… లేవనెత్తుతున్నారు. ఏ విధంగా చూసినా.. అది రాజకీయ కేసేనని.. కొన్నాళ్ల పాటు.. దుష్ప్రచారం చేయడానికే ఉపయోగపడుతుంది కానీ… ఓ ప్రభుత్వం ఎలా వ్యవహరించకూడదో… అనేది.. కేసీఆర్ దీని ద్వారా… దేశానికి చాటి చెప్పబోతున్నారంటున్నారు. రాజకీయంగా.. సరే.. కానీ చట్టం తెలిసిన పోలీసులు.. అతి చేయడంపైనా… ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ముఖ్యంగా కమిషనర్ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
సజ్జనార్ ఉమ్మడి రాష్ట్రంలో కడప జిల్లా ఎస్పీగా పని చేసినప్పుడు.. అనేక అవకతవకలకు పాల్పడ్డారు. దానిపై.. పోలీసు ఉద్యోగులు చేసిన ఫిర్యాదులే పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ప్రభుత్వం బయటకు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ప్రభుత్వ పరంగా.. మరో రాష్ట్ర సార్వభౌమాధికారంలో…ఓ రాష్ట్రం వేలు పెట్టడం అనేది.. జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది.