ఖమ్మం టీఆర్ఎస్ గందరగోళంగా మారింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు ఒక్క సీటే వస్తోంది. ఈ సారి కూడా పరిస్థితులు అలాగే ఉండేలా ఉన్నాయి. జిల్లా ముఖ్య నేతలంతా టీఆర్ఎస్లోనే ఉన్నారు. కానీ ఎవరికీ ఒకరితో ఒకరికి పడదు. తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు, జలగం వెంగళరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో పాటు మంత్రి పువ్వాడ అజయ్ అందరూ టీఆర్ఎస్లోనే ఉన్నారు. జిల్లాలో అన్ని గ్రూపులు టీఆర్ఎస్వే.
పోటీకి అందరూ సిద్ధమవుతున్నారు. కానీ సీట్లు మాత్రం రావడం లేదు. గత ఎన్నికల్లో ఓడిపోయినా తనకు ప్రాధాన్యత వస్తుందని తుమ్మల అనుకున్నారు. కానీ ఆయనను కేసీఆర్ పట్టించుకోలేదు. పైగా ఆయనపై పోటీ చేసి గెల్చిన ఉపేందర్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన పాలేరు నియోజకవర్గంలో పర్యటిస్తూ.. మెల్లగా జనంతో టచ్లోకీ వెళ్తున్నారు. అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారు. పొంగులేని శ్రీనివాసరెడ్డికి బలమైన వర్గం ఉంది. ఆయన పోటీ ఖాయమంటున్నారు
నియోజకవర్గాల వారీగా ద్వితీయ శ్రేణి నాయకులు, ప్రజాప్రతినిధులు వేరువేరుగా రహస్య సమావేశాలు నిర్వహించుకుని ఎవరికి వారుగా పోటీ ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పెత్తనం అంతా మంత్రి అజయ్కే ఉంది. ఆయన తీరుతో ఇప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. సీనియర్లు గ్రూపు రాజకీయాలతో దూరమైతే టీఆర్ఎస్కు ఇంకా గడ్డు పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. అదే జరిగితే ఖమ్మంలో మరోసారి టీఆర్ఎస్కు పరాభవమే ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్ని కేటీఆరే సర్దుబాటు చేయాల్సి ఉంది.