కుర్ర హీరో నిఖిల్ ప్రస్తుతం పెళ్లి చూపుల్లో బిజీగా ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటినుండో ఇంట్లో వాళ్లు ఫోర్స్ చేస్తున్నా అడ్డు పడుతూ వచ్చిన నిఖిల్ ఎట్టకేలకు ఈసారి పచ్చ జెండా ఊపేశాడు. నిఖిల్ తల్లిదండ్రులు ఇప్పుడు తనకు ముకుతాడు వేసే అమ్మాయి కోసం వెతుకుతున్నారు. అయితే తనకు ఎలాంటి అమ్మాయి కావాలే అమ్మకి బాగా తెలిసని త్వరలోనే ఆమెని కనిపెట్టేస్తారని అంటున్నాడు నిఖిల్.
తనకి అర్ధాంగిగా అయ్యే అమ్మాయి తనకంటే మంచి మనసు ఇంకా చెప్పాలంటే అమ్మలా మనసు ఉంటే చాలని అంటున్నాడు నిఖిల్. హ్యాట్రిక్ హిట్స్ తో మంచి జోష్ మీదున్న నిఖిల్ కు ఇటీవల విడుదలైన శంకరాభరణం కాస్త నిరాశ పడేలా చేసినా అదేం పట్టించుకోకుండా మరో సినిమాకు రెడీ అయ్యాడు.
నిఖిల్ చెప్పిన మాటలని బట్టి చూస్తుంటే ఈ సంవత్సరంలో పపన్నం పెట్టేస్తాడనిపిస్తుంది. మరి మన వాడు కోరుకున్నట్టే అమ్మలాంటి మనసున్న అమ్మాయి దొరుకుంతుందో లేదో కొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.