హెచ్‌సీఎల్ గన్నవరంలో క్యాంపస్ నిర్మాణం ఎలా ప్రారంభించింది..?
తిరుపతిలో టీసీఎల్ పరిశ్రమ ఎలా వచ్చింది..?
జియో ఫోన్ల కంపెనీ ఎలా రెడీ అవుతోంది..?
ఫ్లెక్స్ ట్రానిక్స్ పరిశ్రమ ఏపీ వైపు ఎందుకు చూసింది..?
అదాని గ్రూప్‌కి కూడా ఏపీనే ఎందుకు గుర్తొచ్చింది..?
ఇవి మాత్రమే .. కాదు ఇటీవలి కాలంలో.. అనేక భారీ పెట్టుబడులు.. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయి. వీటిని ఏపీ వరకూ తీసుకు రావడానికి.. పడిన కష్టం మొత్తం ఐటీ మంత్రి లోకేష్‌దే. ఏవైనా అగ్రశ్రేణి కంపెనీలు.. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయి.. మంచి అవకాశాల కోసం చూస్తున్నాయని తెలియగానే.. లోకేష్ వారిని సంప్రదించేవారు. దావోస్ సదస్సు కావొచ్చు.. సీఐఐ సదస్సులు కావొచ్చు.. ఏవైనా కానీ.. వారిని సంప్రదించి ఏపీలో ఉన్న పెట్టుబడుల అవకాశాలపై ప్రజెంటేషన్ ఇచ్చేవారు. దాంతో వదిలి పెట్టేవారు కాదు… ఫాలోఅప్‌కు ఓ టీమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆయా సంస్థలు ఒక్క శాతం ఆసక్తి చూపిస్తున్నట్లుగా అనిపించినా … తాను స్వయంగా.. వ్యక్తిగతంగా … ఫాలో అప్ చేసుకునేవారు. అధికార మర్యాదలు, ముఖ్యమంత్రి కుమారుడి లాంటి ట్యాగ్స్ ఏమీ పెట్టుకోకుండా… నేరుగా ఆయా సంస్థల వద్దకు వెళ్లిపోయి.. వారికి ఉన్న సందేహాలను తీర్చేవారు.
ఏపీలో అదాని సంస్థ సుదీర్ఘ ప్రణాళికలతో ముందుకు వచ్చింది. దాదాపుగా రూ. 70వేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రణాళికలతో వచ్చింది. స్పష్టమైన కార్యాచరణతో ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఒప్పందం కుదుర్చుకునే వరకూ అంతా గోప్యంగా ఉంది. ఎవరికీ తెలియదు కాబట్టి… అదానీ కంపెనీ.. ఇక్కడేదో ఆశించి వచ్చిందనుకుంటే.. పొరపాటే. అదాని కంపెనీని పట్టుబట్టి .. లోకేష్ ఏపీకి వచ్చేలా చేయగలిగారు. ఐటీ మంత్రిగా… బాధ్యతలు చేపట్టినప్పుడు లోకేష్.. ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తానని సవాల్ చేశారు. ఆ దిశగా చేసిన ప్రయత్నంలో భాగంగానే అనేక పరిశ్రమలు వస్తున్నాయి. వాటిలో ఒకటి అదాని.
లక్ష ఉద్యోగాలు కల్పించడానికి కంపెనీలను తీసుకు రావడంతో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లారు లోకేష్ కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అనే విధంగా లోకేష్ పనిచేశారు. గత సంవత్సరం దావోస్ పర్యటన లో అదాని గ్రూప్ ముఖ్యులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనువైన పరిస్థితులుని వివరించారు. ఆ తరువాత ఫిన్ టెక్ ఫెస్టివల్ సందర్భంగా మరో సారి అదాని బృందంతో భేటీ అయ్యారు. లోకేష్ విజన్ వారికి నచ్చింది. అదే సమయంలో .. వారు డేటా సెంటర్ల రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. వారి ఆలోచన లోకేష్ తో పంచుకున్నారు. అప్పట్నుంచి లోకేష్ వారి వెంట పడ్డంత పని చేశారు. స్వయంగా ఆయనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్లౌడ్ హబ్ పాలసీ గురించి వివరించి అదాని గ్రూప్ ని ఒప్పించారు
అనుమతులు,అనువైన భూమి ,మౌలిక వసతుల కల్పన,వివిధ శాఖలతో అనుసందానం ఇలా అన్ని తానై అదాని గ్రూప్ ఆంధ్రా కి వచ్చే విధంగా మంత్రాంగం నడిపించారు. ఇతర రాష్ట్రాల నుండి ఉన్న పోటీ నేపధ్యంలో ఎక్కడా సమాచారం బయటకి రాకుండా జాగ్రత్త పడుతూనే పని చక్కబెట్టారు లోకేష్ కేవలం మూడు నెలల్లో వారికి కావాల్సిన అనుమతులు, రాయితీలు,భూమి ఇలా అన్నింటి పై స్పష్టత వచ్చే లా చేసి స్వయంగా గౌతమ్ అదాని అమరావతిలో అడుగు పెట్టే విధంగా చేశారు. నిజానికి రాజకీయంగా కూడా.. అదాని సంస్థ పెట్టుబడులు ఏపీకి రావడం.. కాస్త ఆశ్చర్యకర పరిణామమే. దీన్ని లోకేష్ చేసి చూపించారు.