భీమవరంలో ఓ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచి అడ్డగోలు సంపాదనలో రాటుదేలిపోయిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో మూడో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఊహిచనంత మొత్తం ఆస్తులు, లావాదేవీలు బయటపడటంతోనే మూడో రోజు సోదాలు జరుగుతున్నాయని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఆయనతో పాటు ఆయనతో వ్యాపారాలు చేసే వారి ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు.
గ్రంథి శ్రీనివాస్ ఆక్వా పరిశ్రమను నడుపుతున్నారు. ఆ పరిశ్రమ కేంద్రంగా పెద్ద ఎత్తున నగదు చెలామణి జరిగింది. వ్యాపారాలు లేకపోయినా .. ఉన్నట్లుగా చూపిస్తూ కథ నడిపించారు. ఆ నగదు అంతా ఎవరితో ఇప్పుడు ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ గ్రంథి శ్రీనివాస్.. వసూళ్లు, అవినీతి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆయన అవినీతి గురించి జిల్లాలో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇప్పుడు అదంతా బయటపడే అవకాశం ఉంది.
ఆదాయానికి.. ఆస్తులకు పొంతన లేనంతగా అక్రమాలను గుర్తించారని భావిస్తున్నారు. సోదాలు ఇంకా ఎప్పటికి పూర్తవుతాయో కానీ.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల తాను ఇబ్బంది పడతానని గ్రహించి ఆయన కూటమిపార్టీల్లోకి చేరేందుకు ప్రయత్నించారు. కానీ అవకాశం లభించలేదు.