దేశంలో ఎక్కడ ఐటీ దాడులు జరిగినా.. ఈడీ సోదాలు జరిగినా దాని వెనుక టార్గెట్ రాజకీయ నాయకులు ఎవరు అనే చర్చించుకుంటున్నారు. తెలంగాణలో ఏ చిన్న ఇష్యూ జరిగినా అదే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకూ పెద్దగా సోదాలు జరగలేదు. లోప్రోఫైల్ కంపెనీలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తున్న ట్రైకలర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీల కార్యాలయాలపై దాడులు చేశారు. దేశవ్యాప్తంగా 16 చోట్ల ట్రైకలర్ కంపెనీకి చెందిన కార్యాలయాల్లోసోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ట్రైకలర్ కంపెనీకి చందన్ కుమార్ ఝా చైర్మన్ , మేనేజింగ్ డైరక్టర్గా ఉన్నారు. తెలుగువాళ్లెవరూ కీలక పొజిషన్లలో ఉన్నట్లుగా ఆ సంస్థ వెబ్సైట్లో లేదు. టీవలి కాలంలో తెలంగాణలో పలు రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. పెద్ద ఎత్తున పన్నులు చెల్లించని విషయాన్ని గుర్తించినట్లుగా సీబీడీటీ ప్రకటించింది. ఇప్పుడు మరో హైదరాబాద్ కంపెనీని టార్గెట్ చేయడంతో హాట్ టాపిక్ అవుతోంది.
ట్రైకలర్ కంపెనీ అంత అంత గొప్పగా ప్రాజెక్టులు చేపట్టినట్లుగా ఎక్కడా బయటపడలేదు. కానీ లావాదేవీలు మాత్రం భారీగా ఉన్నాయని తెలుస్తోంది. ఏదైనా రాజకీయ నేతలకు చెందిన బినామీ వ్యవహారాలు ఏమైనా నడుపుతున్నారా అనేది ఐటీ అధికారులే తేల్చాల్సి ఉంది. అంతర్గతంగా ఇలాంటి గుట్టుముట్లు ఐటీకి బాగా తెలుసు. రాజకీయంగా టార్గెట్ చేసి.. చుట్టూ దిగ్బంధం చేయాలనుకుంటే ఇలాంటి పెద్దగా ప్రచారం లేని కంపెనీలపై ముందుగా ఐటీ దాడులు చేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది.