తెలంగాణలో ఐటీ అధికారుల కదలికలు ప్రారంభమయ్యాయి. వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కంపెనీలను టార్గెట్ చేసుకుని ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతలో పలు కంపెనీలపై ఇలా సోదాలు జరిగాయి. ఇప్పుడు మరో బడా కంపెనీ వాసవి గ్రూప్‌పై ఎటాక్స్ చేశారు. పదుల సంఖ్యలో బృందాలతో ఒక్క సారిగా విరుచుపడిన ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఇరవై కంపెనీల పేర్లతో వాసవి గ్రూప్ వ్యాపారాలు చేస్తోంది. అనేక ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసింది.
వీరి లావాదేవీలు వేల కోట్లలోనే ఉంటాయి. అయితే దానికి తగ్గట్లుగా పన్నులు చెల్లించడం లేదని.. అందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. కానీ బడా రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే.. ఎన్నో లింకులు ఉండాలి. ముఖ్యంగా రాజకీయ నేతల లింకులు లేకుండా అది రియల్ ఎస్టేట్ కంపెనీ కాలేదు. ఎందుకంటే బ్లాక్ మనీ అంతా పోగుపడేది రియల్ ఎస్టేట్‌లోనే. అలా సంపాదించుకునేది రాజకీయ నేతలే. వారి సొమ్మే వివిధ రూపాల్లో రియల్ ఎస్టేట్ కంపెనీల్లోకి పంపుతూ ఉంటారు. అయితే ఇదెక్కడా రికార్డుల పరంగా ఉండదు. పలుమార్లు ఆ నేత బినామీ ఆస్తులు.. ఫలానా కంపెనీల్లో ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు.
దర్యాప్తు సంస్థలు చేతుల్లో ఉన్న వారికి వీటిపై అవగాహన ఉంటుంది. అందుకే టార్గెట్ చేయాలనుకున్న వారిని సాలిడ్‌గా ఆయా కంపెనీలపై దాడులు చేయడం ద్వారా చేస్తారు. తెలంగాణలో జరుగుతున్న ఐటీ దాడులు కూడా ఆ కోణంలోనివేనా అన్న చర్చ జరుగుతోంది. వేల కోట్ల వ్యాపారాలు చేసే బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు రాజకీయ సంబంధాలు లేకుండా ఉండవు. అందుకే తెలంగాణలో ఎప్పుడు ఐటీ దాడులు జరిగినా.. ఆ సంస్థలు ఎవరివి.. వారు ఎవరికి సన్నిహితులన్న గుసగుసలు వినిపిస్తూంటాయి. మరి తాజాగా ఐటీ దాడులు జరుగుతున్న వాసవి గ్రూప్ లింకులు ఉన్నది ఏ పార్టీకో ?