ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీగా ప్రజలు భావిస్తున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలో ఐటీ సోదాలు నిరంతరాయంగా సాగుతున్నాయి. సోమవారం ఉదయం ప్రారంభించిన సోదాలు.. గురువారం కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కంపెనీకి సంబంధించిన కార్యాలయాలు, రికార్డులు అన్నీ కడపలోనే ఉన్నాయి. అక్కడ సీఆర్పీఎఫ్ రక్షణలో సోదాలు జరుగుతున్నాయి.
షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ.. విశ్వేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిది. ఆయన జగన్ బంధువు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాక ముందు ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేసే ఓ కుటీల పరిశ్రమ లాంటిది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక లక్ష కోట్ల పెట్టుబడులు ప్రకటించింది. ఇందులో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఈ కంపెనీ ఇండోసోల్ అనే అనుబంధ సంస్థ ప్రారంభించింది. ఆ సంస్థలోకి విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అరబిందో కూడా వాటాలు కొన్నది. చాలా అనుమానాస్పద లావాదేవీలు జరిగాయి.
ఏపీ ప్రభుత్వం వేల ఎకరాల భూముల్ని కట్టబెట్టింది. అవసరం లేకపోయినా వేల కోట్ల విలువైన ట్రాన్స్ ఫార్మర్లను కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఎన్నో అవకతవకలు జరిగాయని భావిస్తున్నారు. ఐటీ సోదాలు జరుగుతూండటంతో… సమాచారం ఏమీ బయటకు రాకపోతూండటంతో.. సోదాల్లో ఏమి దొరికిందని తెలియడం లేదు. నాలుగు రోజులుగా సోదాలు చేస్తున్నారంటే..ఊహించనంత అక్రమాలు బయటపడి ఉంటాయని భావిస్తున్నారు.