ఐటీ అధికారులు మరోసారి తెలుగుదేశం పార్టీ నేతలపై గురి పెట్టారు. ఈ సారి టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. ఆయన కుటుంబానికి చెందిన కార్యాలయాలు, ఫ్యాక్టరీల్లో సోదాలు చేస్తు్ననారు. చెన్నై టీ నగర్ లో ఉన్న ఆయన కార్యాలయం, పూందమల్లిలో ఉన్న ఆయన కంపెనీకి చెందిన ఫ్యాక్టరీలోనూ సోదాలు చేస్తున్నారు. మాగుంట కుటుంబానికి మాగుంట బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో ఉన్న బాలాజీ బిస్లరీ, బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఎండ్రికా ఎంటర్ప్రైజెస్ కంపెనీల్లో సోదాుల చేశారు. శుక్రవారం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నా.. ఈ రోజే బయటకు తెలిసింది. మాగుంట కుటుంబీకుల నివాసాలకు వెళ్లకపోయినప్పటికీ, ఆ కుటుంబానికి చెందిన మూడు కంపెనీలు, వారి సన్నిహితులకు సంబంధించిన ఏడు కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.
ఇటీవలి కాలంలో టీడీపీ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. శ్రీకాకుళం నుచి నెల్లూరు జిల్లా వరకూ .. ఆర్థికంగా బలంగా ఉన్న ప్రతి ఒక్క టీడీపీ లీడర్ ను టార్గెట్ చేశారు. సోదాలు చేశారు. సోదాల్లో ఏమి బయటపడిందో ఎవరూ చెప్పలేదు. ఏమైనా నోటీసులు జారీ చేశారో కూడా.. ఎవరికీ తెలియదు. కానీ టీడీపీ నేతపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మాగుంట శ్రీనివాసుల రెడ్డిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు .. విజయసాయిరెడ్డి కొంత కాలంగా ప్రయత్నిస్తున్న ప్రకాశం జిల్లా రాజకీయవర్గాలకు స్పష్టంగా తెలుసు. ఆయన తరచూ మాగుంట కుటుంబీకులతో సమావేశమై.. వైసీపీలోకి రావాలని ఒత్తిడి చేస్తూ ఉంటారు. అయితే మొదట్లో ఊగిసలాడిన మాగుంట.. ఇటీవలి కాలంలో.. టీడీపీలోనే ఉండాలని గట్టిగా నిర్ణయించుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో.. మరోసారి మాగుంట కుటుంబాన్ని కార్నర్ చేయాడనికే ఈ దాడులు చేస్తున్నారన్న అభిప్రాయాలు ప్రకాశం జిల్లా రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సుజనా చౌదరిని బీజేపీలో చేర్చుకునేదుకు ఈడీని రంగంలోకి దించారని చెబుతున్నారు. ఆయనపై రూ. 5,700 క ోట్లు ఎగ్గొట్టినట్లు ఆరోపించారు.. కానీ ఇంత వరకూ కేసు నమోదు చేశారా.. చేస్తే.. ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. రెండు రోజులు కార్యాలయానికి పిలించి ప్రశ్నించారు. తర్వాత సైలెంట్ అయిపోయారు.