సినిమాల్లో చూపించిన ట్విస్టుల మాదిరిగా టాలీవుడ్‌పై ఐటీ అధికారులు సడన్ ఎటాక్స్ ప్రారభించారు. అగ్రనిర్మాతలందర్నీ టార్గెట్ చేస్తూ వందల మంది అధికారులతో సోదాలు ప్రారంభించారు. ఉదయం నుంచి అగ్రనిర్మాతగా ఉన్న దిల్ రాజు ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. తర్వాత మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లు, ఆఫీసుల్లోన ఎంటరయ్యారు. దిల్‌రాజు ఇళ్లు, ఆఫీసులతో పాటు శిరీష్, దిల్ రాజు కూతురు ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. దిల్‌రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లల్లోనూ ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఏకకాలంలో అనేకచోట్ల సోదాలు చేస్తున్న 65 బృందాలు, ఎనిమిది ప్లేసుల్లో సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి దిల్‌రాజు ప్రొడక్షన్స్ నుంచి రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను భారీ బడ్జెట్‌తో నిర్మించారు దిల్‌రాజు. అలాగే బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్‌గా దిల్‌రాజు వ్యవహరించారు.
మైత్రీ సంస్థ మీద కూడా ఐటి దాడులు జరుగుతున్నాయి. మైత్రీ నవీన్, సిఇఒ చెర్రీ, ఇంకా సంస్థ సంబంధీకుల అందరి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు . మైత్రీ సంస్థ ఇటీవలే పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఏకంగా రూ. 18వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లుగా.. స్వయంగా ఆ సంస్థ పోస్టర్లు రిలీఫ్ చేసింది.
మ్యాంగో మాస్ మీడియా సంస్థకు చెందిన కార్యాలయాల్లోనూ తనిఖీలు సాగుతున్నాయి. పూర్తి స్తాయిలో కసరత్తు చేసి.. రెయిడ్ సినిమా తరహాలో దాడులు చేస్తున్నారు. రెండువందలా మందికిపైగా అధికారులు ఈ దాడుల్లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎంత దొరుకుతాయన్నది మాత్రం బయటకు వచ్చే అవకాశం లేదు. దిల్ రాజు భారీగా నష్టపోయారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆయన మునిగిపోకుండా బయటపడ్డారు. మైత్రీ మూవీ లో జరిగే సోదాల్లో పుష్పకు వచ్చిన అసలు కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.