తెలంగాణలో నిర్మాణ సంస్థల కంపెనీలపై వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. విషయాలు పెద్దగా బయటకు రావడం లేదు కానీ ఇప్పటికే నాలుగైదు కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇవన్నీ టీఆర్ఎస్ నేతలకు అత్యంత సన్నిహితమైనవే. ఈ కంపెనీల ద్వారా యూపీ ఎన్నికలకు ఇతర పార్టీలకు సాయం పంపిణీ చేశారన్న ఆరోపణలు ఉండటంతోనే ఐటీ దాడులు చేస్తున్నారన్నఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాళేశ్వరం , పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేస్తున్న ఐదారు సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేస్తోదంి. కేఎన్ఆర్ ఇన్ఫ్రా, గజ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్వీఆర్, జీవీఆర్ వంటి కంపెనీల్లో పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నారు. ఈ కంపెనీన్నీ కాంట్రాక్టులు పొందిన కంపెనీలకు సబ్ కాంట్రాక్టర్లుగా పని చేస్తున్నాయి. రిజర్వాయర్లు, ఎత్తిపోతల కాల్వలు, పైపులైన్లు, టన్నైల్పనులు చేస్తున్న సంస్థలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఒక్కో సంస్థ రూ. రెండు వేల కోట్ల వరకూ పనులుచేస్తున్నారు.
గజ ఇన్ఫ్రాస్ట్రక్షర్ అనే కంపెనీ వట్టెం రిజర్వాయరు సబ్‌కాంట్రాక్టర్. మెఘా కన్స్ట్రక్షన్నుంచి సబ్తీసుకుని ఏదుల టూ వట్టెంల టన్నెల్పనులు రూ. 1000 కోట్లతో చేస్తున్నారు. ఈ గజ కంపెనీ సత్యం రామలింగరాజు కుటుంబానిది. తేజరాజు దీన్ని నడిపిస్తున్నారు. ఆయనతో కేటీఆర్‌కు ఉన్న సంబంధం గురించి అందరికీ తెలుసు. దీపికా కన్స్ట్రక్షన్ఓ ఎమ్మెల్యే అల్లుడు కంపెనీ. ఓ ఎమ్మెల్సీ కూడా ఈ సంస్థలో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్వీఆర్ ఇన్ఫ్రా ఏపీ వ్యక్తి పేరుతో ఉంటుంది కానీ తెలంగాణ మంత్రి దీనికి అండాదండా అనిచెబుతారు.
ఈ కంపెనీల ద్వారా రాజకీయ కార్యకలాపాలకు నిధులు తరలిస్తున్నారన్న స్పష్టమైన సమాచారం ఉండటంతోనే ఐటీ దాడులు చేసి గుట్టు బయటకు లాగుతున్నారని భావిస్తున్నారు. ఈ సోదాల్లో వాటికి ఆధారాలు దొరికితే తెలంగాణలో రాజకీయం మరింత మరే అవకాశం ఉంది.