మోడీపై అవిశ్వాస తీర్మానం పెట్టిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పై ఐటీ ఎటాక్.. అంటూ.. నేషనల్ మీడియాలో నిన్న సాయంత్రం.. ఐటీ దాడుల వ్యవహారం ఒక్క సారిగా హాట్ టాపిక్ అయింది. దీనికి కారణం.. గల్లా జయదేవ్.. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని.. పార్లమెంట్లో గర్జించడం మాత్రమే కాదు.. దేశంలోనే.. అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తల్లో ఒకరు కావడమే కారణం. అమరరాజా బ్యాటరీస్ వైస్ చైర్మన్ గా ఆయన జాతీయ స్థాయిలో సుపరిచితుడు. దాంతో.. ఆయనపై ఐటీ దాడులనే సరికి.. అదీ కూడా బరిలో ఉన్న అభ్యర్థి కావడంతో.. ఐటీ దాడులు సంచలనాత్మకం అయ్యాయి.
ఆరు గంటల పాటు… గల్లా జయదేవ్ ఆడిటర్ని నిర్భందించడమే కాదు… వేధించినట్లుగా కూడా ప్రచారం జరిగింది. అదే సమయంలో.. దేశంలో జరుగుతున్న ఐటీ దాడుల వ్యవహారం కూడా… ఢిల్లీలో చర్చనీయాంశమయింది. మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ సన్నిహితల ఇళ్లలో వందల మంది అధికారులు సోదాలు చేశారు. అధికారికంగా ఏం దొరికిందో చెప్పలేదు కానీ… వందల కోట్లంటూ.. ప్రచారం మాత్రం చేసుకుంటూ వచ్చారు. ఐటీ దాడులు మొత్తం.. బీజేపీ వ్యతిరేకపక్షాలపై మాత్రమే జరుగుతూండటంతో.. ఈసీపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. మోడల్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు.. అభ్యర్థులపై ఐటీ దాడులు చేయడం అనేది.. చట్ట విరుద్ధమన్న వాదన ఉంది. చేయాలనుకుంటే.. ఈసీకి కచ్చితంగా సమాచారం అందించాలి. కానీ ఐటీ అధికారులు అలా చేయడం లేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. ఇదంతా.. ఓ ప్రణాళిక ప్రకారం.. టీడీపీ అభ్యర్థుల్ని మానసికంగా వేధించేందుకే చేస్తున్నారని.. దీని వెనుక వైసీపీ ఉందని గట్టిగా నమ్ముతున్నారు. ఏపీ విషయంలో.. ప్రత్యేకంగా ఈసీ, బీజేపీ, వైసీపీ కలగలసి… ఈ వ్యవహారాలు చక్క బెడుతున్నాయని ఆయన నమ్ముతున్నారు. అందుకే తీవ్ర స్థాయిలో ఖండించారు కూడా. ఎవరేమనుకున్నా.. ఐటీ అధికారులు మాత్రం.. బీజేపీ, వైసీపీ నేతల జోలికి వెళ్లకుండా… టీడీపీ అభ్యర్థులను మాత్రం టార్గెట్ చేసుకుంటూ…పని కానిస్తున్నారు.