ప్రముఖ ఫార్మా కంపెనీ హెటెరో డ్రగ్స్‌పై ఆదాయపు పన్ను శాఖఅధికారులు గురి పెట్టారు. పెద్ద ఎత్తున సోదారు నిర్వహిస్తున్నారు. సంస్థకు చెందిన యూనిట్లతో పాటు సంస్థకు చెందిన డైరక్టర్ల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సంస్థపై నిర్దిష్టమైన ఆరోపణలు ఏమైనా ఉన్నాయో లేదో క్లారిటీ లేదు. కానీ పన్ను ఎగవేత ఆరోపణలు, అక్రమ నగదు చెలామణి వంటి విషయాల్లో ఫిర్యాదులు రావడంతో సోదాలు జరుపుతున్నట్లుగా భావిస్తున్నారు.
హెటెరో సంస్థ అధినేత పార్థసారధి రెడ్డి ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వ్యక్తి. ఆయన జగన్ అక్రమాస్తుల కేసుల్లోనూ నిందితునిగా ఉన్నారు. ఆయనపై సీబీఐ పలు క్విడ్ ప్రో కో ఆరోపణలు చేసింది. ఇటీవలి కాలంలోనూ విశాఖలో కొన్ని వ్యాపార సంస్థలను చేజిక్కించుకోవడంలో ఆ సంస్థ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విశాఖలోని ఆ ప్లాంట్‌కు ప్రత్యేకంగా 83ఎకరాలను క్రమబద్దీకరించారు.
వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డికి హెటెరో డ్రగ్స్ అధినేతతో దగ్గర సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. అందుకే హెటెరో డ్రగ్స్ వ్యవహారంలో ఐటీ సోదాలు వ్యాపార వర్గాల్లోనే కాకుండా రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతున్నాయి.