సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే ఐటెమ్ సాంగ్ ఉండాల్సిందే. ఆర్య, ఆర్య 2, జగడం. రంగస్థలం సినిమాల్లో మంచి ఐటెమ్ గీతాలు కుదిరాయి. నాన్నకు ప్రేమతో, వన్ సినిమాల్లో ఐటెమ్ గీతాలకు ఆస్కారం లేకుండా పోయింది. అయితే `పుష్ప`లో మాత్రం ఆ ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో అదిరిపోయే ఓ ఐటెమ్ గీతం ఉంది. దానికి సంబంధించిన ట్యూన్ కూడా ఓకే అయిపోయింది. ఈ పాట ఈ ఆల్బమ్ మొత్తానికి స్పెషల్ గా ఉండబోతోందని టాక్. ఇందులో నర్తించడానికి బాలీవుడ్ నుంచి ఓ పేరున్న కథానాయికని తీసుకురావాలని చిత్రబృందం యోచిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. అందుకే తమిళ, మలయాళ నటీనటులకు కూడా చిత్రబృందంలో చోటు కల్పించనున్నారు. ఐటెమ్ గాళ్ ని మాత్రం బాలీవుడ్ నుంచి దిగుమతి చేసే అవకాశం ఉంది. ఈ పాటతో పాటు ‘పుష్ప’ పేరుతోనూ ఓ మంచి పాటని కంపోజ్ చేశాడట దేవి. ఈ పాటని దేవిశ్రీ ప్రసాదే రాశాడని టాక్. ఈ రెండు పాటలూ.. మాస్కి నచ్చేలా ఉంటాయని సమాచారం.