పోలీసుల ట్రాప్‌ను ఆర్జీవీ గుర్తించలేకపోతున్నారు. తనను పట్టుకోవడం లేదని అనుకుంటున్నారు. తాను పరారీలో లేనని అంటున్నారు. సాంకేతికంగా ఆయన పరారీలో ఉన్నట్లుగా పోలీసులు ఫ్రేమ్ సృష్టించారు. ఆయన ఎదురుగా ఉన్నా ఇప్పుడు పోలీసులు పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే ఆయనకు న్యాయపరమైన అన్ని అవకాశాలను ముగించాలని పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ ట్రాప్‌లో ఆర్జీవీ ఇరుక్కున్నారు.
తనను అరెస్టు చేసి కొడతారని ఆర్జీవీ భయడపడుతున్నారు. ఆయనను కొట్టాల్సినంత కోపం ఏపీ పోలీసులకు.. లేకపోతే ప్రభుత్వ పెద్దలకు ఎందుకు ఉంటుంది?. తనను ఓ జోకర్‌గా చూడాలని.. జోకులేనని..సెటైర్లేశానని ఆయన చెప్పుకుంటున్నారు. కానీ ఎలా చూడాలో చట్టం కోణం నుంచి చూస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టే వారిని అరెస్టు చేయవద్దంటూ విజయ్ బాబు వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందన చూస్తే ఆర్జీవీకి న్యాయపరంగా కూడా ఎలాంటి రిలీఫ్ రాదని అర్థమైపోయింది.
ఆర్జీవీకి తాను చేసిన తప్పేమిటో తెలుసు. రెండు, మూడు టీవీ చానళ్లకు పిలిపించుకుని తనదైన సుత్తి చెప్పి కన్ ఫ్యూజ్ చేయవచ్చని అనుకుంటున్నారో.. లేక తనను అరెస్టు చేసి కొడతారని జాతీయ మీడియా చానళ్లన్నింటికీ ట్యాగ్ చేసి చెబితే.. పోలీసులు వెనక్కి తగ్గుతారని అనుకుంటున్నారో కానీ.. రోజు రోజుకు ఆర్జీవీ.. మరింత కూరుకుపోతున్నారు. ఆయనకు న్యాయసలహాలు ఇస్తున్న హైకోర్టు లాయర్‌గా మారిన సాక్షి టీవీ అనలిస్ట్ క్లీన్ షేవ్ బాలయ్య .. రాజమండ్రి జైలు బయట కూడా అలాంటి ప్రెస్మీట్లు పెడతారు. దాని వల్ల ఆయన మీడియాలో కనిపిస్తారు కానీ.. ఆర్జీవీ మాత్రం జైల్లో ఉంటారు.