హైదరాబాద్: సన్నీలియోన్ అనే పేరు భారతీయులందరికీ అతి కొద్ది కాలంలోనే సుపరిచితమై పోయింది. దేశంలోని ప్రముఖులలో ఒకరిగా మారటమే కాకుండా, నెట్లో అత్యధికంగా సెర్చ్ చేయబడే మహిళగా నిలిచారు. గతంలో విదేశాలలో పోర్న్ సినిమాలలో పనిచేసిన సన్నీ 2012లో జిస్మ్ 2 చిత్రంతో బాలీవుడ్లో అడుగు పెట్టారు. ఈ మూడేళ్ళలో 5 సినిమాలలో నటించారు… అనేక షోలలో పాల్గొన్నారు. అయితే, పోర్న్ సినిమాలలో విశృంఖలంగా నటించిన సన్నీకి సిగ్గు ఎక్కువట. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. ఈ విషయం ఎవరూ నమ్మకపోవచ్చని, కానీ తనకు బాగా సిగ్గని అన్నారు. బాలీవుడ్ స్టార్లు ఎవరైనా ఎదురైతే తాను హలో కూడా చెప్పలేనని తెలిపారు. తాను ఇంకా సోషల్‌గా ఉండటం నేర్చుకుంటున్నానని చెప్పారు. తాను పార్టీలకు వెళ్ళటం తక్కువని తెలిపారు. ఇంత త్వరగా ఇండియాలో తనకు బాగా గుర్తింపు వచ్చినప్పటికీ, తాను ఈ విజయాన్ని తలకెక్కించుకోలేదని అన్నారు.
సన్నీ లియోన్ చెప్పినట్లే ఆమెలో మరో కోణంకూడా ఉంది. సన్నీకి 2011లో డేనియల్ వెబర్‌తో వివాహమయింది. డేనియల్ ఆమెకు మేనేజర్‌గా కూడా వ్యవహరిస్తారు. వారిద్దరిదీ అన్యోన్యమైన దాంపత్యం. సన్నీ అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, పేటా వంటి పలు చారిటీ సంస్థలకు విరాళాలు అందిస్తారు. ఇటీవల ముంబై నగరంలో ఒక పాఠశాలను దత్తత తీసుకుని అనేక సౌకర్యాలు కల్పించారు. తనపై వచ్చిన అనేక వివాదాలను, కేసులను ఆమె హుందాగా ఎదుర్కొన్నారు.