మహిళలు సమానమే కానీ.. మన చట్టాలకు కాస్త ఎక్కువ సమానం. ఎంతగా అంటే నేరాలు చేస్తే.. మగవాళ్లే చేస్తారు. ఒక వేళ ఆడవాళ్లు నేరాలు చేస్తే దానికి బలమైన కారణాలు ఉంటాయి. పాపం ఆమె విధిలేక చేసిందని అంటారు. పాలకులు రూపొందించిన చట్టాలు కూడా ఇలా అధిక సమానత్వంతో మహిళలకు ఎక్కువ అడ్వాంటేజ్ కల్పించారు. ఫలితంగామగవాళ్ల నలిగిపోతున్నారు. అందరూ కాకపోయినా తప్పుడు ఆలోచనలు ఉన్న మహిళల కారణంగా ఎంతో మంది మగవాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి.
498A సెక్షన్ బాధితులు లక్షల్లో !
ఓ మహిళ కుట్రపూరితంగా ఓ డబ్బులున్న ఫ్యామిలీలో యువకుడ్ని పెళ్లి చేసుకుంటుంది. పదిరోజుల్లో కావాలని గొడవపడి ఇంటికెళ్లిపోతుంది. తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి వరకట్న కేసు పెడుతుంది. కేసు విత్ డ్రా చేసుకోవాలంటే ఊహించనంత డబ్బుుల,బంగారం, పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఆ కుటుంబానికి మరో చాయిస్ ఉండదు. ఎందుకంటే ఆ మహిళ చేసిన ఆరోపణల్లో నిజం ఉందా లేదా అని పోలీసులు చూడరు. చూడమని చట్టం కూడా చెప్పదు. కానీ కేసు పెట్టేస్తారు. అదీ క్రిమినల్ కేసులు. తర్వాత కేసులకు గురైన కుటుంబానికి ఎదురయ్యే టార్చర్ అంతా ఇంతా కాదు. చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బెంగళూరులో అతుల్ సుభాష్ లాంటి వారు వారు దేశవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ఉన్నారు.
మహిళలు నేరాలు చేసినా సానుభూతి ఎందుకు ?
ఇటీవల బాపట్లలో ఓ మహిళ తన భర్తను నడిరోడ్డు మీదపీక కోసి చంపేసింది. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. వెంటనే మీడియాలో తాగొచ్చి వేధిస్తాడని.. అదనీ ఇదనీ కథనాలు ఇచ్చి.. ఆమె చేసింది కరెక్టే అన్న అభిప్రాయాన్ని కల్పించడానికి మీడియా, సోషల్మీడియా పోటీపడింది. అదే ఓ భర్త.. తన భార్య ఘోరాలు చేస్తోందని ఇలా చంపేస్తే.. ఎలాంటి రియాక్షన్ ఉండేది?. సులువుగానే ఊహించవచ్చు. కీచకుడు..రాక్షసుడు అని పేరు పెట్టి వేధించేవారు. ఇక్కడ ఇద్దరిదీ తప్పే. చంపడం అనేది ఎవరు చేసినా తప్పే. కానీ మహిళల విషయంలో ఎందుకు సానుభూతి చూపిస్తున్నారన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం . ఇలాంటి అడ్వాంటేజ్ లను తీసుకుని కొంత మంది మహిళలు రెచ్చిపోతున్నారు.
ఆత్మహత్యలు చేసుకోక ముందే కాపాడాలి?
దుర్బుద్దితో డబ్బు కోసం పెళ్లిళ్లు చేసుకునే మహిళల నుంచి మగ సమాజాన్ని, వారి కుటుంబాల్ని కాపాడాల్సిన తక్షణ అవసరం కనపడుతోంది. ఓ యువతి తన సోదరుడికి జరిగిన 498ఏ వేధింపుల విషయంలో సోషల్మీడియాలో పెట్టిన వీడియో వైరల్ అయింది. రాజమండ్రికి చెందిన మహిళ .. పెళ్లి చేసుకున్న పది రోజుల్లోనేకేసులు పెట్టింది. ఐదేళ్లుగా కోర్టువిచారణకూ రావడంలేదు. కోర్టు కూడా ఆమెను ఏమీ అనడం లేదు. వీరినే నిందిస్తున్నారు. ఆమె అడిగినట్లుగా డబ్బుచెల్లిస్తే బయటపడవచ్చు. కానీ అలా చెల్లించినా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే. అందుకే 498ఏ విషయంలో.. చట్టం సమానంగా ఉండేలా చూడాలని కోరుతున్నారు.
మహిళలు వేధింపులకు గురి కావడం లేదని ఎవరూ చెప్పడం లేదు. కానీ ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసే మహిళల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు.