ఈరోజు హైదరాబద్ కి వెరీ వెరీ స్పెషల్. కారణం.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మెట్రో రైలు ప్రారంభాని భాగ్యనగరానికి రానున్నారు. రెండు .. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారాల పట్టి ఇవాంక ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సులో పాల్గోవడానికి వస్తున్నారు. ఇప్పటికే ఆమె హైదరబాద్ చేరుకున్నారు.
బేసిగ్గా వార్త ఇచ్చే ప్రేయరిటీ ఇలా వుండాలి. ఎందుకంటే మెట్రో రైలు అనేది హైదరాబాది చిరకాల స్వప్నం. సాక్ష్యత్ దేశ ప్రధాని వస్తున్నారు. ఇంతకంటే గొప్ప ప్రాధాన్యత మరొకటి వుండదు. కానీ మీడియా ఎప్పుడూ గ్లామర్ పాయింటే పట్టుకుంటుంది. అందుకే ఇప్పుడు ఈ వార్త ఆర్డర్ కూడా మారిపోయింది. మన మీడియాకి ట్రంప్ కూతురు విపరీతంగా నచ్చేసినట్లు వుంది. ఛానల్ ఆన్ చేయడమే ఆలస్యం.. ఇవాంక బొమ్మే కనిపిస్తుంది. ఆమె వచ్చేసింది.. ఆ కార్ లో దిగింది… ఈ దుస్తులు వేసుకుంది.ఆ హోటల్ వుటుంది. ఈ ఫుడ్ తింటుంది.. హీరోయిన్ సమంత ఆమెకు గొల్లభామ చీర గిఫ్ట్ గా ఇస్తుంది… ఆమె చుట్టూ ఇంతమంది వుంటారు.. ఇలా ఒక్కటి కాదు.. మీడియా అంత ఇవంకా మయమే.
ఇక్కడితో ఆగలేదు. ఆమెపై అరగంట సేపు బులిటెన్స్ నడిపారు. అందులో ఇవాంక కూడా తెలియని రహస్యాలు చెప్పారు. ఒక ఛానల్ అయితే ట్రంప్ తెలివితేటలు ఏమీ లేవని, ఆయన మాస్టర్ మైండ్ ఇవాంకనే అని చెప్పే ప్రయత్నం చేసింది. ఇది వింటే ఇవాంక కూడా షాక్ అయిపోతుందేమో.
ఇఅంతేకాదు.. ఇవాంక బాల్యం నుండి ఇప్పటివరకూ ఏవీలు కట్ చేశారు. ఇవాంక గ్లామర్ ఎంతటిదో చెప్పారు. తెలుగు పాటలను ఆమె బొమ్మలకు ఎడిట్ చేసి కలర్ ఫుల్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. అబ్బా.. ఆ హడావిడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పటికే ఇవాంక ఇవాంకని రాష్ట్ర ప్రభుత్వం వెగటు పుట్టించే హడావిడి చేసింది. ఇప్పుడు మీడియా కూడా అదేదో బ్రహ్మండమని చూపిస్తుంది.
ఏదేమైనా .. మోడీ ఎక్కడికి వెళ్ళినా ఆయనే స్పెషల్ ఎట్రాక్షన్. కానీ ఈసారి ఇవాంక ఎఫెక్ట్ తో అంత ఫోకస్ గా కనిపించడం లేదు.