ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు… తన అభిప్రాయాలను… తరచూ వెల్లడిస్తూ ఉంటారు. ముఖ్యంగా విధానపరమైన నిర్ణయాలు.. పాలనా తీరుపై..ఆయన రిటైరైనప్పటి నుండి కథనాలు రాస్తున్నారు. అమరావతిపై ఓ పుస్తకం రాశారు. అయితే.. ఇవన్నీ… సాక్షి పత్రికలో మాత్రమే ఎక్కువగా కనిపించేవి. ఆయన ట్వీట్లు.. ఆర్టికల్స్.. ఏవి రాసినా.. సాక్షి పత్రికే ప్రాధాన్యం ఇచ్చేంది. దాంతో ఆయన చంద్రబాబుపై కోపంతో.. జగన్మోహన్ రెడ్డికి లబ్ది చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వచ్చేవి. అమరావతిపైనా.. చంద్రబాబు పాలనా విధానంపైనా… విధానాల్లో లోపాలాపైనా.. ఆయన పదుల సంఖ్యలో ఎడిటోరియల్ పేజీలో ఆర్టికల్స్ రాశారు. వాటిని సాక్షి పత్రిక సమగ్రంగా ప్రచురించింది.
అయితే.. ఈ సారి ఆయన ఆర్టికల్ సాక్షిలో కాకుండా.. ఈనాడులో ముద్రితమయింది. ఎల్వీ సుబ్రహ్మణ్యం తొలగింపు వ్యవహారంపై.. మొదటగా.. సోషల్ మీడియాలో స్పందించి… అన్యమతస్తులపై చర్యలు తీసుకోవడమే.. కారణమన్నట్లుగా… జనంలోకి సందేశం పంపిన ఐవైఆర్.. ఆ తర్వాత పాలనా పరంగా.. సీఎంవో అధికారంపై.. మాట్లాడటం ప్రారంభించారు. సీఎంవో అధికారులే.. మొత్తం పాలనను నడుపుతున్నారని.. సీఎస్ ను సైతం డమ్మీని చేస్తున్నారన్న అభిప్రాయంతో.. ఓ భారీ ఆర్టికల్‌ను.. రాశారు. దీన్ని సహజంగానే.. ఇంత కాలం తన ఆస్థాన పత్రికగా ఉన్న సాక్షి ప్రచురించదు. ఎందుకంటే.. వివాదం.. ఎల్వీ తొలగింపు వల్ల వచ్చింది.. ఆ తొలగించింది..జగన్మోహన్ రెడ్డి. ఆయనపై విమర్శిస్తూ.. ఐవైఆర్ రాస్తే సాక్షి ప్రచురించే అవకాశం లేదు. అందుకే.. ఆయన ఈనాడును ఎంచుకున్నారు. ఈనాడు కూడా.. ఆయన గతాభిప్రాయాలతో నిమిత్తం లేకుండా… ఆర్టికల్‌ను ఎడిటోరియల్ పేజీలో ప్రచురించేసింది.
ఐవైఆర్ ఆర్టికల్స్ సాక్షి నుంచి ఈనాడుకు మారడం మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతుందని.. భావించవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… అప్పటి అధికారపక్షానికి వ్యతిరేకంగా.. ఎవరు మాట్లాడినా… ప్రోత్సహించిన సాక్షి మీడియా.. ఆ తర్వాత కూడా.. వారంతా.. తనకు అనుకూలంగానే మాట్లాడాలని అనుకుంటోంది. అలా లేకపోతే.. సహజసిద్ధంగా బ్యాన్ చేస్తోంది. ఈ కోవలోకి.. ముందుగానే ఐవైఆర్ చేరిపోయారు.