ఐవైఆర్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రజాప్రయోజనం కోసం అంటూ.. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసింది. ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ విషయంలో.. ఐవైఆర్ కృష్ణారావు పడిన హైరానా.. .హైకోర్టులో పిటిషన్ వరకూ వెళ్లింది. ప్రస్తుతం ఫౌండేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్ అనే స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు. ఈ సంస్థకు అధ్యక్షుని హోదాలో… హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీని ప్రకారం.. ” ప్రభుత్వ అధికారులకు కనీస పదవి కాల భద్రత” కల్పించాలని ఆయన కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్ వేయడంలో.. సదుద్దేశం కనిపించడం లేదని స్పష్టం చేస్తూ కొట్టి వేసింది. అఖిలభారత సర్వీసు అధికారుల విషయంలో ఇప్పటికే.. సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఒక వేళ అమలు కాలేదని భావిస్తే.. సుప్రీంకోర్టులో కేసు వేయవచ్చని సూచించింది.
బదిలీపై అసంతృప్తి ఉంటే.. ఎల్వీ సుబ్రహ్మణ్యం కోర్టును ఆశ్రయించవచ్చని.. హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు పిటిషన్ కొట్టి వేయడంతో.. సుప్రీంకోర్టుకు వెళ్తానని ఐవైఆర్ చెప్పుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం తొలగింపుపై.. ఎల్వీ కన్నా . .ఐవైఆర్ ఎక్కువగా.. ఆవేశపడుతున్నారు. ఎల్వీని తొలగించినప్పుడే.. సోషల్ మీడియాలో.. సీఎంవో అధికారుల బాధ్యత లేని అధికారం అంటూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన తర్వాత.. పత్రికల్లో ఆర్టికల్స్ రాశారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అధికారుల బదిలీలు ఆయన చేతుల మీదుగానే జరిగాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు.. ఇలా ఎవరికైనా.. కరెండేళ్లు పదవీకాల భద్రత ఇవ్వాలన్న సిఫార్సును ప్రభుత్వానికి చేయలేదు.
ఐవైఆర్ కృష్ణారావు నిజానికి.. ఏపీ ప్రభుత్వ పెద్దలకు..నిన్నామొన్నటి వరకూ సన్నిహితుడే. చంద్రబాబుతో చెడిన తర్వాత ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. వైసీపీ హైకమాండ్ కు దగ్గరయ్యారు. సాక్షి మీడియాలో కావాల్సినంత స్పేస్ పొందారు. వైసీపీలో చేరుతారని అనుకున్నారు కానీ.. ఆయన బీజేపీని ఎంచుకున్నారు. ఇప్పుడు.. వైసీపీ సర్కార్ ను.. కోర్టుకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.