చంద్రబాబు నాయుడు పై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల అవినీతిపై సీబిఐ విచారణ కోరుతూ దాఖలైన ఈ వ్యాజ్యాన్ని కోర్ట్ విచారణకి స్వీకరిస్తుందా, కొట్టివేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మరియు వేమూరి రవికుమార్ లు ఐటీ శాఖలో దొంగ ఎంఓయూ ల పేరుతో డొల్ల కంపెనీ లకు అనుమతులిచ్చి 25 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఈ పిల్ పేర్కొంది. ఈ ప్రజా ప్రయోజనవ్యాజ్యం వేసిన మాజీ న్యాయమూర్తి , ప్రజా పార్టీ వ్యవస్థాపక అద్యక్షులు జె.శ్రవణ్ కుమార్ , దీని పై సిబిఐ మరియు ఈడీ లతో విచారణ జరిపించాలని కోరారు. పైగా ఈ మాజీ న్యాయమూర్తి జె.శ్రవణ్ కుమార్ స్వయంగా తన వాదనలు వినిపించబోతున్నటు తెలుస్తోంది.
ఇంతకీ కోర్టు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టి వేస్తుందా లేక విచారణకు స్వీకరిస్తుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. అలాగే ఎన్నికల ఏడాది ఉన్నట్టు ఉండి ఇలాంటి కేసులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాకుండా ఉంది. ఒకవేళ ఇది ఆపరేషన్ గరుడ లో భాగమా అన్నది కూడా తెలియాల్సి ఉంది.