ఓ చిన్నపాటి సెలబ్రెటీ అనే పేరు తెచ్చుకొంటే చాలు.. ఆర్భాటంగా పెళ్లి చేసుకొంటారు. స్లార్లని పిలుచుకొని, మీడియాలో మంచి ప్రమోషన్ వచ్చేలాచూసుకొంటారు. కానీ.. అదేంటో కమెడియన్ షకలక శంకర్ మాత్రం గప్‌చుప్‌గా అతి సాదాసీదాగా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చాడు. అవును.. షకలక శంకర్ పెళ్లయిపోయింది. శ్రీకాకుళం అరసవల్లిలోని కల్యాణ మండపంలో గప్ చుప్గాక్రవారం పెళ్లి చేసుకొన్నాడు. పెళ్లి కూతురు శంకర్ మేనమామ కూతురే. ఇంత సడన్‌గా, అంత రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటని అడిగితే… . తండ్రి మొక్కు వల్లే అరసవల్లిలో పెళ్లి చేసుకున్నానన్నాడు. హైదరాబాద్‌కి దూరమనే ఉద్దేశంతోనే సహచర నటులెవరినీ ఆహ్వానించలేదన్నారు. హైదరాబాద్ వచ్చాక మాత్రం రిసెప్షన్ గ్రాండ్ లెవిల్లోఉంటుంది అంటున్నాడు షకలక శంకర్. ఎనీవే… కొత్త పెళ్లి కొడుకు శంకర్‌కి కంగ్రాట్స్ చెప్పేయండి.