స్టార్ బోయ్ సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా ‘జాక్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ‘బేబీ’తో గుర్తింపు సంపాదించిన వైష్ణవి చైతన్య కథానాయిక. ఈనెల 10న వస్తోంది. ఇప్పటి వరకూ ‘జాక్’ కథేమిటి? ఇందులో హీరో పాత్ర ఎలా ఉండబోతోంది? అనే విషయాన్ని దాచి పెట్టింది చిత్రబృందం. ట్రైలర్లో బయటపెట్టక తప్పలేదు.
ఈ సినిమాలో జాక్ అని పిలుచుకొనే జాక్సన్ ఓ ప్రైవేట్ ఏజెంట్. ఓవైపు సీబీఐ ఓ టెర్రరిస్ట్ కోసం అన్వేషిస్తుంటుంది. అదే టెర్రరిస్ట్‌ని పట్టుకోవడానికి జాక్ వస్తాడు. జాక్ పంథానే వేరు. ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్‌కి భిన్నంగా ఆలోచిస్తాడు. అక్కడి నుంచే ఫన్ మొదలవుతుంది. ఇంతకీ ఆ టెర్రరిస్ట్ ని పట్టుకొన్నారా, లేదా? అనేది మిగిలిన కథ.
ఉగ్రవాదం, ఇన్వెస్టిగేషన్ నేపథ్యాలు తెలుగు తెరకు కొత్త కాదు. కానీ.. ఇక్కడ ఉన్నది టిల్లు. కాబట్టి, ఈ జోనర్లో ఫన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. సిద్దు అలవాటు ప్రకారం… లొడ లొడ మాట్లాడుతూనే ఉన్నాడు. మధ్యలో బీప్ వేయగల కొన్ని బూతులు వినిపించాయి. అవి సెన్సార్ కట్ లో పోవడం గ్యారెంటీ. సిద్దుకే సాధ్యమైన కామెడీ టైమింగ్, ఆ డైలాగ్ డెలివరీతో మరోసారి ఫన్ పండించే ప్రయత్నం చేశాడు. ట్రైలర్ చివరి షాట్ లో ఓ లెంగ్తీ డైలాగ్ ని ముస్లిం యాసలో పలికిన విధానం బాగుంది. ప్రకాష్ రాజ్ పాత్ర కూడా కొత్తగానే ఉన్నట్టు అనిపిస్తోంది. వైష్ణవి గ్లామర్ పండించే పాత్రలో కనిపించబోతోంది. సిద్దు ఈసారి యాక్షన్ హీరోగా అవతారం ఎత్తడానికి ప్రయత్నించాడు. ఛేజింగులు, ఫైటింగులకు లోటు లేదు. మరి కామెడీ,యాక్షన్ మిక్సప్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.