పవన్ కల్యాణ్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గతంలో నమోదైన కేసును గుంటూరు కోర్టు కొట్టి వేసింది. అసలు తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు తేల్చేశారు. అయితే న్యాయవాది జడ శ్రవణ్ తాజాగా.. ఆ కేసును రీ ఓపెన్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు మాత్రమే చేయి తగిన పనిని గుంటూరు నాలుగో అదనపు జిల్లా కోర్టు కేసు ఉపసంహరించడం చట్ట విరుద్ధమని జడ శ్రవణ్ అంటున్నారు.
గుంటూరు జిల్లా కోర్టు పరిధి దాటి పవన్ కళ్యాణ్ పై కేసు ఉపసంహరణకు అనుమతి ఇచ్చిందని.. 30 వేల మంది వాలంటీర్లను అవమానపరిచిన పవన్ కళ్యాణ్ పై ఉపసంహరించుకోవడం ప్రభుత్వ అధికార దుర్వినియోగమని ఆయన అంటున్నారు. అధికారం అడ్డం పెట్టుకుని కేసులు ఉపసంహరించుకోవడం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు వ్యతిరేకమని అంటున్నారు. ఈ పిటిషన్‌పై విచారణ బుధవారం జరిగే అవకాశం ఉంది.
వాలంటీర్లను అడ్డం పెట్టుకుని అందరూ రాజకీయాలు చేస్తున్నారు. అసలు పవన్ అన్నది ఒకటి అయితే.. ప్రచారం చేసేది మరొకటి.. దాన్ని పట్టుకునికేసులు పెడుతున్నారు. గత ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోలు జారీ చేసి మరీ కేసులు పెట్టింది. అసలు వాలంటీర్లు తాము ఫిర్యాదే చేయలేదని చెబితే కోర్టు కొట్టివేసింది. అయినా ఇప్పుడు కొత్త పిటిషన్‌తో జడ శ్రవణ్ కుమార్ తెరపైకి వచ్చారు.