లండన్ నుంచి వచ్చిన జగన్ రెడ్డి చాలా రోజుల వరకూ మాట్లాడలేదు ఓ రెండుగంటల రికార్డెడ్ ప్రెస్ మీట్ ను వదిలారు. చంద్రబాబునాయుడు ఇటీవల ప్రకటించిన నీతి ఆయోగ్ రిపోర్టుకు కౌంటర్ అన్నట్లుగా తనకు అనుకూలమైన నివేదికలు తీసుకు వచ్చి.. తనకు ఏదో తెలుసన్నట్లుగా ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ.. ఆయన అసలు విషయానికి బదులు చంద్రబాబుపై రాసిచ్చిన విమర్శలు చదవడానికి మాత్రమే ఎక్కువ ప్రాక్టిస్ చేయడం వల్ల ఆయన చెప్పిందేమీ ఎవరికీ అర్థం కాలేదు.
తాను నాలుగు పోర్టులు కట్టానని చెప్పి మూడు పోర్టుల వివరాలు చెప్పారు. ఆ మూడు పోర్టుల్లో కనీసం పాతిక శాతం పనులు కాలేదు. ఆ పోర్టులతో రాష్ట్రం గతి మార్చేద్దామనుకున్నారట. కనీసం రోడ్లు కూడా బాగు చేయచేయడానికి చేత కాలేదని చెప్పుకోలేకపోయారు. పారిశ్రామికంగా తాను సీఎంగా ఉన్నప్పుడు పెట్టుబడులు వెల్లువెత్తాయి.. గ్రాఫ్లు పైకి చూపించేవి తీసుకొచ్చి చూపించారు. ఏ పెట్టుబడులు వచ్చాయో మాత్రం చెప్పే ధైర్యం చేయలేకపోయారు. అప్పులు పట్టుడం లేదు మహా ప్రభో అని చంద్రబాబు కిందా మీదా పడుతూంటే.. తన కంటే ఎక్కువ అప్పులు చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
విచిత్రం ఏమిటంటే.. ఉచితంగా ఇస్తున్న ఇసుక, పారదర్శక మద్యం విధానంలో స్కాం జరిగిందని ఆయన చెబుతున్నారు. ఇసుక అందుబాటులో ఉండటమే కాదు సగానికి ధర తగ్గిందని ప్రజలు అనుకుంటూఉంటే.. జగన్ మాత్రం రెట్టింపు అయిందన్న భ్రమల్లో ఉన్నారు. కేజ్రీవాల్ తరహాలో లిక్కర్ స్కాం చేశారని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. సొంత బ్రాండ్ల తయారీ నుంచి అమ్మకం వరకూ చేసింది మాత్రం మంచిదని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి విచిత్రాలతో ఎప్పట్లాగే చంద్రబాబును చంద్రముఖి అని.. మోసంలో పీహెచ్డీ అని చెప్పుకొచ్చారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లు మాత్రమే అమ్మఒడి ఇచ్చారు. రైతులకు ఒకే విడతలో రైతు భరోసా ఇస్తానని .. మోసం చేశారు. విద్యార్తుల ఫీజులు ఎగ్గొట్టారు. కానీ అన్నింటితో సాక్షి మీడియాకు వందల కోట్లు దోచిపెట్టారు. ఇప్పుడు వచ్చి అవాస్తవ ఆరోపణలతో రికార్డెడ్ ప్రెస్ మీట్లు రిలీజ్ చేస్తున్నారు.