చంద్రబాబు వచ్చే యాభై ఏళ్ల వరకూ ఏం చేయాలో చెబుతూంటాడని అప్పటి వరకూ ఎవరు బతికి ఉంటారని సీఎం జగన్ చాలా తెలివిగా ప్రశ్నించారు. ఆయన ముఖ్యమంత్రి భవిష్యత్ తరాల కోసం పని చేయాల్సిన తెలివి తేటలతో పరిపాలిస్తున్న వ్యక్తిగా జగన్రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డికి సొంత ఆలోచన ఉండదు. రాసిచ్చిందే చదువుతారు. బహుశా ఆ మేధావి కూడా ఇదే రాసి ఇచ్చి ఉంటారు. ప్రదాని మోదీ కూడా 2047 అని ప్రణాళికలు వేస్తున్నారు. అందరి దగ్గరా విజన్ డాక్యుమెంట్ అడుగుతున్నారు. దాన్ని బట్టి దేశం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.
మరి జగన్ రెడ్డి కూడా ప్రధాని మోడీని ఇలాగే అంటున్నట్లేగా? జగన్ రెడ్డి తన తెలివితేటలతో తాను లేదా తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆస్తుల్ని సొంత ఆస్తులుగా అమ్మేసకుని క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారు. ఇప్పటికీ అదే చేస్తున్నారు. ఆయన వ్యాపారాలు మాత్రం అద్భుతంగా సాగుతున్నాయి. ఈ విషయంలో ఆయన విజన్ వచ్చే ముఫ్పై , నలభై కాదు..99 ఏళ్ల వరకూ ఉంటుంది. ఇటీవల తన బినామీ కంపెనీకి విశాఖలో బేపార్క్ ను 99 ఏళ్లకు లీజుకిచ్చేశారు. కానీ రాష్ట్రం దగ్గరకు వచ్చే సరికి మాత్రం అప్పటి్ వరకు ఎవరుంటారు.. ఎవరు బతికి ఉంటారని కబుర్లు చెబుతున్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు శంకుస్థాపన చేసేసి ఇక నీళ్లిస్తున్నాం పండగ చేసుకోండన్నట్లుగా పల్నాడు ప్రజల ముందు గప్పాలు కొట్టుకున్నారు. నాలుగేళ్ల తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పంండబెట్టేశారు. పోలవరంను సర్వనాశనం చేశారు. అన్నీ రెడీగా ఉన్నా కట్టలేదు. చివరికి అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల అని ప్రారంభించి.. వేల కోట్లు బిల్లులు అస్మదీయులకు చెల్లించారు కానీ పనులు మాత్రం కాలేదు.
కానీ చంద్రబాబుపై ఎప్పుడూ చెప్పే అబద్దాల దండకం మాత్రం.. రాసుకొచ్చి మరీ చదువుతారు. పల్నాడులో మరోసారి అదే చేశారు. చంద్రబాబు బీసీల్ని ఏదో అన్నారని.. ఎస్సీల్ని ఏదో అన్నారని.. ఆయన హామీల్ని అమలు చేయరని.. అమరావతి భూములనీ ఎప్పుడూ చెప్పే కబుర్లన్నీ చెప్పారు. చివరిలో.. తనకు పేపర్లు టీవీలు కూడా లేవన్నారు. ఇంతా చెప్పి ఆయన ఏమడిగారంటే…అబద్దాలు చెప్పేవాళ్లను నమ్మవద్దని.