ప్రభుత్వం ఏం చేసినా జగన్ రెడ్డికి ముందు సాక్షి పత్రికలో ఎన్నికలకు ముందు ఏం చెప్పారో అదంతా మళ్లీ చెప్పుకోవాలని ఆశ పడుతుంది. వెంటనే ఓ చాట భారతం రాసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తాజాగా స్కూల్ పేరెంట్స్, టీచర్స్ మీట్ పైనా అదే ఏడుపు వినిపించారు. సాధారణంగా పీటీఎంలు మార్చిలో జరుగుతాయని జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు పెట్టకూడదని ఆయన తీర్మానించేశారు. ఓ మంచి పద్దతిలో జరిగిన పీటీఎంలు స్కూళ్ల అభివృద్ధి కోసం.. పిల్లల వికాసం కోసం నిర్వహించారు.
అదే వైసీపీ హయాంలో పీటీఎంలు రాజకీయ అవసరాల కోసం ఉపయోగించకోవాలనుకున్నారు. అది కూడా ఎన్నికలకు ముందు పెట్టాలనుకున్నారు. దురుద్దేశం స్పష్టం కావడంతో తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనుకడుగు వేశారు. తన హయాంలో స్కూళ్లకు ఏదో చేశానని ఆయన చెబుతున్నారు. కానీ విద్య అభివృద్ధి చెందాలంటే పిల్లలకు నాణ్యమైన చదువు అందించాలంటే ఉపాధ్యాయులు ముఖ్యం. అది వదిలేసి స్కూళ్లకు రంగులేసి.. బల్లలు కొని.. వందల కోట్లు అవినీతి చేశారు.
జగన్ రెడ్డి తాను చేసిన పోయిన నిర్వాకాలన్నింటినీ ప్రభుత్వం పై వేయడం అన్నది కామన్. ఎదుటి వారికి నిజాలు తెలిసినా ఆయన అదే పద్దతిలో మాట్లాడుకుంటూ వెళ్లిపోతారు. ఎందుకంటే తాను చెప్పింది నమ్మేవారుంటారని ఆయన నమ్మకం. విద్యావ్యవస్థను సర్వనాశనం చేసినందునే పెద్ద ఎత్తున విద్యార్థులు తగ్గిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ స్కూళ్లలో చేరేవారి సంఖ్య పెరగనుంది.