జగన్ రెడ్డికి ఆత్రం ఆగడం లేదు. పాతాళంలోకి పడిపోయామని తెలిసినా .. మీరందరూ కలిసి యుద్ధం చేసి నన్ను సీఎంను చేస్కోండి అని క్యాడర్, లీడర్ కు ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. తాను సీఎంగా ఉంటేనే మీరంతా బాగుంటారని విచిత్రమైన బ్లాక్ మెయిలింగ్ కు కూడా దిగుతున్నారు. నాలుగు నెలలు కాక ముందే జగన్ రెడ్డికి నిద్రపట్టని పరిస్థితి వచ్చింది. ఇప్పటి నుండే ఆయన సీఎం కావాలని.. కలలు కంటున్నారు.
పార్టీ అనుంబధ సంఘాల నేతలుగా కుల సైన్యాన్ని నియమించిన తర్వాత వారికి జగన్ రెడ్డి చేసిన హితబోధ సారాంశం ఒక్కటే. మీరు యుద్ధం చేయండి. నేను సీఎం అవుతానని. ఆయన సీఎం అవుతారో లేదో కానీ.. ముందుండి యుద్ధాన్ని నడిపించేందుకు సిద్ధంగా లేరని మాత్రం వారికి క్లారిటీ వచ్చింది. పార్టీ నేతలు, క్యాడర్ బలిపశువులు అయితే వారి నడుచుకుంటూ పోయి పీఠం అందుకోవాలనేది జగన్ రెడ్డి ఆరాటం. పార్టీ క్యాడర్ కు ఇప్పటికే విషయం అర్థం కావడంతో అందరూ పార్టీకి దూరమయ్యారు.
జగన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో పార్టీ నేతల్ని కూడా వదల్లేదు. వారికి బిల్లులు కూడా చెల్లించలేదు. కనీసం పట్టిచుకున్నపాపాన పోలేదు. వాలంటీర్లను.. సచివాలయ సిబ్బందిని పెట్టి వారే గొప్ప అన్నట్లుగా వ్యవహరించారు. వాలంటీర్లనే లీడర్లను చేస్తానన్నాడు కానీ కార్యకర్తలకు కనీస భరోసా ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం వారే కావాలని.. యుద్ధం చేయాలని పిలుస్తున్నారు. జగన్ మైండ్ సెట్ చూసి ఆయనను నమ్మి నట్టేట మునిగిపోయిన వారిని చూసి.. యుద్ధం చేసి బలి కావాల్సిన అవసరం ఏమిటని ప్రతి ఒక్కరికీ సందేహం వస్తోంది. అందుకే ఎవరూ స్పందించడంలేదు.