ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. వారాంతం పొలిటికల్ ఆర్టికల్ “కొత్తపలుకు”లో.. అప్పుడప్పుడూ కొన్ని సంచలనాత్మక విషయాలు వెల్లడిస్తూ ఉంటారు. వేమూరి రాధాకృష్ణ జర్నలిస్ట్‌గా… కెరీర్ ప్రారంభించి పత్రికాధిపతిగా ఎదిగారు. ఈ క్రమంలో ఆయనకు… ఎప్పుడెప్పుడో ఏమి జరిగిందో.. జరుగుతుందో… ఆయనకు ఉన్న పరిచయాల ద్వారా బాగానే తెలిసి పోతూంటుంది. చాలా వరకూ పేపర్లలో రాసి.. టీవీల్లో ప్రకటించలేని అంశాలు.. రూమర్స్గా ప్రజల్లోకి వెళ్తాయి. అలాంటి వాటిని నిజమేనని ధృవీకరించేలా.. వేమూరి రాధాకృష్ణ “కొత్తపలుకు” ఆర్టికల్‌లో చెబుతూంటారు. అలాంటివి ఈ వారం ఆర్టికల్‌లో రెండు, మూడు ప్రస్తావించారు.
జగన్ పాలనతో తెలంగాణకు మహర్దశ..!
జగన్మోహన్ రెడ్డి పరిపాలన.. తెలంగామకు.. మేలు జరిగేలా ఉందని.. వేమూరి రాధాకృష్ణ నేరుగానే చెబుతున్నారు. ఈ విషయంపై.. సంపూర్ణమైన అవగాహన.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉందంటున్నారు. ఆయన రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో… త్వరలోనే మీ శాఖ ఆదాయం రూ. పది వేల కోట్లకు చేరుకుంటుందని అన్నారట. అంటే.. దానర్థం… ఏపీలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం మళ్లీ .. తెలంగాణకు తరలి వస్తుందన్నమాట. దానికి తగ్గట్లుగానే పరిస్థితులు ఉన్నాయని “కొత్తపలుకు”లో గుర్తు చేశారు. అమరావతి ప్రాంతంలో పూర్తిగా ప్రాజెక్టులు నిలిచిపోవడంతో… అక్కడ కార్యకలాపాలు ఆగిపోయాయి. స్థిరాస్థి రంగంలో పెట్టుబడులు పెట్టేవాళ్లు హైదరాబాద్ వైపే చూస్తున్నారు. ఫలితంగా ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి.
వాటాల కోసం జగన్ అప్పట్లో ఏం చేశారు..?
అవినీతి లేని సమాజం అని అంటున్న జగన్మోహన్ రెడ్డి… వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారో… రెండు ఉదాహరణలు.. “కొత్తపలుకు”లో వేమూరి రాధాకృష్ణ చెప్పారు. అందులో… ఒకటి.. ప్రస్తుతం.. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత విజయవంతమైన సెజ్‌లలో ఒకటిగా ఉన్న శ్రీసిటిలో.. వాటాకోసం జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టడం. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో వివిధ సంస్థలలో వాటాల కోసం.. జగన్ పారిశ్రామిక వేత్తలను బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటినే వేమూరి రాధాకృష్ణ అధికారికంగా చెప్పారు. అందులో జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలకు వాటా ఇచ్చారో లేదో కానీ.. వివాదం మాత్రం.. వైఎస్ చొరవతో సద్దుమణిగిపోయిందంటున్నారు. అలాగే.. మరో గ్యాస్ వెలికితీత ప్రాజెక్టులోనూ ఇలాగే వాటా కోసం.. జగన్ రచ్చ చేయడంతో.. వివాదం సోనియా గాంధీ వరకూ వెళ్లిందని … ఆ దెబ్బకు.. ఆ బడా పారిశ్రామికవేత్త.. ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టకూడదని నిర్ణయించుకున్నారని వేమూరి రాధాకృష్ణ ప్రకటించారు.
ఏపీ.. వెనిజులాగా మారుతుందా..?
అసెంబ్లీలో కేసీఆర్ ను మంచోడని పొగడ్తల వర్షం కురిపించిన జగన్మోహన్ రెడ్డి.. ప్రజలు కూడా తనను మంచోడు అనిపించుకోవడానికి… సంక్షేమ మంత్రం పాటిస్తున్నారని.. కానీ నిధుల గురించి మాత్రం బాధ్యత తీసుకోవడం లేదని..”కొత్తపలుకు” సారాంశం. పరిస్థితులు దానికి తగ్గట్లే ఉన్నాయంటున్నారు. జగన్ తీరు చూస్తే.. ఏపీ మరో వెనిజులా అవుతుందనే అంచనా వేమూరి రాధాకృష్ణ ఆర్టికల్‌లో కనిపించింది. ఆదాయం పెంచుకునే పనులేమీ లేకపోగా.. అప్పులు చేసి.. సంక్షేమానికి నిధులు ఖర్చు పెట్టడమే దీనికి కారణమంటున్నారు.