తెలంగాణలో షర్మిల రాజకీయంగా గుర్తింపు కోసం తంటాలు పడుతున్నారు. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ఆమెను రాజకీయ పార్టీగా గుర్తించడానికి తెలంగాణ సమాజం ఇంకా సిద్దం కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తిరుగులేని అధికారం నేతగా గుర్తింపుపొంది తెలంగాణలో సైతం మంచి పట్టు ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె ఇప్పుడు అనామకంగా నిలిచారు. ఆమెకు కనీసం ఒక్క శాతం ఓట్లు వస్తాయని ఎవరూ చెప్పడం లేదు. కనీసం ఓ ఫోర్స్ గా కూడా చూడటం లేదు. దీంతో షర్మిల రాజకీయంగా తనకూ గుర్తింపు ఉందని నిరూపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
షర్మిలను అరెస్ట్ చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇంత వరకూ ఎవరూ చెప్పుకోలేదు. కానీ షర్మిల హఠాత్తుగా బేడీలు తీసుకు వచ్చి ప్రెస్ మీట్లో పెట్టి.. చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. తనను చంపాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఆమె వ్యవహారం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయిందే తప్ప.. ఎలాంటి అటెన్షన్ క్రియేట్ చేయలేదు . దీనికి కారణం ఇదంతా పీకే మార్క్ డ్రామా అని ఎక్కున మంది నమ్మడమే. అదే సమయంలో ఆమె కుటుంబం మొత్తం వైఎస్ మరణాన్ని ఎలా రాజకీయంగా వాడుకున్నారో ప్రజలకు క్లారిటీ ఉంది.
ఎయిడ్స్‌తో చనిపోయిన వాళ్లను సైతం వైఎస్ కోసం చనిపోయారని ఓదార్పు యాత్ర చేశారని నేషనల్ మీడియానే చాలా సార్లు బయట పెట్టింది. ఇక ఆయన మరణంపై అనుమానాల పేరుతో ఎన్నికలొచ్చినప్పుడల్లా వారు ఆడుకునే రాజకీయ ఆట ఇంతా ఇంతా కాదు. ఇప్పటి వరకూ అదే చేసి.. తాము ఎవరిపై ఆరోపిస్తున్నామో వారికే ఇంట్లో విందు భోజనం ఇచ్చాక … ప్రజల్లో ఇక ఆ అంశంపై వారు మాట్లాడే మాటలకు విశ్వసనీయత ఉంటుందనుకోవడం .. ప్రజల్ని తక్కువ అంచనా వేయడమే.
ఇలాంటి రాజకీయాలే కాదు. .. చివరికి పాలనలోనూ రాజన్న పాలన అంటూ జగన్ చేస్తున్న పాలన తెలంగాణలో చర్చనీయాంశమవుతోంది. రాజకీయంగా ప్రత్యర్థుల్ని హింసించడం.. దోపిడీ.. మద్యం విధానం పేరుతో నిరుపేదల రక్తం పీల్చడం వంటివి ఇప్పటికే తెలంగాణ సమాజంలో చొచ్చుకుపోయాయి. అవి కూడా షర్మిల వైపు కనీస మాత్రం చూపు పడకపోవడానికి కారణం అవుతోంది. అంతకు మించి షర్మిలను తెలంగాణ బిడ్డగా ఒక్కరంటే ఒక్కరూ చూడటం లేదు. ఇవన్నీ అంచనా వేసుకోకుండా షర్మిల చాలా విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు.