ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్రలో… విజ్ఞాపన పత్రాల్లో కనిపించనిది.. ఎజెండాలో అత్యంత కీలకంగా ఉన్నది ఒకటి ఉంది. అదే… ఇద్దరు అధికారుల్ని.. ఏపీకి తీసుకొచ్చుకోవడం. వాళ్లిద్దరూ.. ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర, ఐఏఎస్ శ్రీలక్ష్మి. తెలంగాణ క్యాడర్‌కు చెందిన వీరిని.. ఏపీకి పంపాలని.. రకంగా.. ఏపీ సర్కార్.. కేంద్రంపై… తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అంగీకరించి… ప్రక్రియ పూర్తి చేసినా.. వ్యవహారం డీవోపీటీ దగ్గర అగిపోయింది. అయితే.. నిబంధనలు కారణంగా చెబుతున్నప్పటికీ.. కేంద్రం మాత్రం.. ఈ అధికారుల్ని ఏపీకి పంపడానికి ఇష్టపడటం లేదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి విజయసాయిరెడ్డి… వారి కోసం.. లాబీయింగ్ చేయని రోజంటూ లేదు.
తాము ఎన్ని విజ్ఞప్తులు చేసినా… కేంద్రం స్పందించకపోతూండటంతో.. నేరుగా.. విజయసాయిరెడ్డి.. శ్రీలక్ష్మిని తీసుకుని ఓ సారి అమిత్ షాను కలిశారు. అయినా పని కాలేదు. దాంతో.. నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే రంగంలోకి దిగారు. ఢిల్లీ పర్యటనలో..ఆయన కూడా.. తెలంగాణ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని తీసుకుని… ఆయన ప్రధాని వద్దకు వెళ్లారు. తన భేటీలో… శ్రీలక్ష్మికి కూడా అవకాశం ఇచ్చారు. అలా శ్రీలక్ష్మిని కూడా తీసుకెళ్లారంటే.. ఆమెను ఏపీకి పంపే ఫైల్ క్లియర్ చేయాలని.. అడగకుండా ఉంటారా..?. ఈ భేటీల్లో స్టీఫెన్ రవీంద్రను తీసుకెళ్లడం లేదు. దీనికి కొన్ని కారణాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఓ వర్గం కోటరీ తయారవుతోందని.. ఇది కేంద్రానికి ఇష్టం లేదని చెబుతున్నారు. మళ్లీ ఆయనను తీసుకెళ్లి లాబీయింగ్ చేస్తే.. మొదటికే మోసం వస్తుందని.. శ్రీలక్ష్మి ఫైల్‌తో పాటు.. ఆ ఫైల్‌ను కూడా క్లియర్ చేయించుకోవాలని జగన్ పట్టుదలతో ఉన్నట్లుగా చెబుతున్నారు.
జగన్ సీఎం అవగానే.. ఇంటలిజెన్స్ చీఫ్ గా.. స్టిఫెన్ రవీంద్రకు.. సీఎంవోలో కీలక బాధ్యతలు.. శ్రీలక్ష్మికి వచ్చినట్లుగా.. అందరూ ఫీలయ్యారు. వారు కూడా.. అంతే భావించారు. అమరావతికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తెలంగాణ సర్కార్ ఒప్పుకుంది ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇక కేంద్రానికి ఏం ఇబ్బందిలే అనుకున్నారు. కానీ.. అసలు కేంద్రమే.. అడ్డుకుంది. ఇప్పుడు జగన్ నేరుగా వెళ్లి విజ్ఞప్తులు చేయాల్సి ఏర్పడింది. మరి మోదీ కనికరిస్తారో లేదో…?