“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 37 మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇస్తే అందులో 35 మంది చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు. మిగిలిన ఇద్దరు కూడా అదే సామాజికవర్గానికి చెందిన వారిని పెళ్లి చేసుకున్నారు..” ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిలబడి.. తన వెనుక ఉన్న .. ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని పదే పదే నిజమేనా అన్నట్లుగా… సైగలు చేస్తూ.. ఆయన కూడా.. కాన్ఫిడెంట్గా.. తల ఊపుతూంటే… అంత కంటే ఎక్కువ నమ్మకంగా.. జగన్ చెప్పిన మాటలు ఇవి. అటు జగన్.. ఇటు బుగ్గన.. ఇద్దరూ .. తాము చెబుతున్నది నిజం అని నమ్మించడానికి చేసిన ప్రయత్నం అది.. ఇని తర్వాత బయటకు వచ్చింది.
నిజామా..? పోలీసు శాఖలో డీఎస్పీలుగా..అంత మంది చంద్రబాబు సామాజికవర్గానికి వాళ్లున్నారా..?. సీఐల నుంచి డీఎస్పీలుగా ప్రమోషన్ పొందిన వారిలో అంత మంది సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారా..? అని పోలీసు వర్గాలే ఆశ్చర్యపోయాయి. ఎందుకంటే.. ఇప్పటి వరకూ.. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలుగా ప్రమోషన్లు ఇచ్చేవారు. వాటిని కూడా.. కోర్టు తీర్పులకు అనుగుణంగా ఇచ్చేవారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి.. ప్రమోషన్లు ఎప్పుడొచ్చాయో అని.. ఒక్క సారి… మొత్తం డాటా బయటకు తీశారు. దాంతో అసలు లెక్క బయటకు వచ్చింది. దీంతో.. తమను.. జగన్ రాజకీయంగా వాడుకుంటున్నారని.. తమపై కులం ముద్ర వేస్తున్నారని.. పోలీసులు గుర్తించారు. వెంటనే తమ అధికారుల సంఘం పేరు మీద పూర్తి వివరాలతో ఓ ప్రకటన విడుదల చేయించాయి. ” పోలీసు అధికారుల మనో దైర్యం దెబ్బ తీసే విధంగా మరియు కులం పేరుతో నిందలు వేయడం మమ్ములను అనగా రాష్ట్ర పోలీసులను తీవ్రంగా బాధించింది. ఈ సందర్బముగా DSP ల ప్రమోషన్ల లో 37 మందికి గాను 35 మందికి ఒకే సామజిక వర్గం వారికీ, అడ్డదారులలో ప్రమోషన్లు కల్పించారు అనే విషయం పూర్తిగా సత్యదూరమైనది. ప్రస్తుతం మొత్తం 91 సబ్ డివిజన్లు ఉండగా అందులో OC -32, BC -30, SC -06, ST -04, ముస్లిమ్స్ -05, IPS అధికారులు- 05, ఖాళీలు -09, వున్న విషయం గమనించాలని కోరుచున్నాము…” అనే క్లారిటీ ఇచ్చారు. అంటే.. అసలు మొత్తం డీఎస్పీల్లో ఓసీలే జగన్ చెప్పినట్లు 37 మంది లేరు.
అసలు అలా జరగడానికి అవకాశం ఉండదని జగన్ కు తెలియదా..? ఎవరో చెప్పింది నమ్మేశారా..? అంటే…. ప్రజలు నమ్మడం కష్టం . ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి అంత అమాయకుడు కాదు. కానీ.. రాష్ట్రంలో ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో.. ఒక్క సామాజికవర్గానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఓ బలమైన అభిప్రాయం ఏర్పడాలన్న ఉద్దేశంతో.. అదే సామాజికవర్గానికి ఏపీలో ప్రాధాన్యత లభిస్తోందన్న ప్రచారం … ప్రారంభించడానికే జగన్ ఈ ప్రచారం ప్రారంభించారు. ఇది అబద్దమని అబద్దమై ఉంటుందని ఆయనకు తెలుసు. కానీ అది అబద్దమైన సరే.. ఆయనకు కావాల్సింది.. ఓ సామాజికవర్గంపై… దుష్ప్రచారం. తానే దాన్ని ప్రారంభించారు. అంతా పక్కా వ్యూహంతోనే జరిగింది. దాన్ని పోలీసుల్ని వాడుకున్నారు అంతే..!