డిసెంబర్ ఎనిమిదో తేదీన విశాఖలో రుషికొండ ప్యాలెస్ లోకి జగన్ తన భార్య భారతిరెడ్డితో కలిసి ప్రవేశించబోతున్నారు. విశాఖ పాలన పేరుతో అక్కడ కాపురం పెట్టాలనుకుంటున్నారు. గతంలో తన విశాఖ కాపురం ప్రారంభమవుతుందని జగన్ రెడ్డి బహిరంగసభల్లో ప్రకటించారు. ఆయన మాటలకు ముహుర్తం డిసెంబర్ 8ను ఖరారు చేశారని అంటున్నారు. ఎందుకంటే.. డిసెంబర్ 9 న జగన్ సతీమణి భారతీరెడ్డి పుట్టిన రోజు అని … అందుకే డిసెంబర్ 8ను ముహుర్తంగా పెట్టుకున్నారని అంటున్నారు.
రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై ఇప్పటికే ప్రజల్లో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. విశాఖకు పరిపాలనా రాజధాని మార్చాలనుకున్న తరవాత సీఎం జగన్ నివాసం కోసం చాలా సెర్చ్ చేశారు. ఈ సెర్చ్ లో సీఎం జగన్ సతీమణి కూడా పాల్గొన్నారు. బేపార్క్ లాంటివి చూసి ఓకే చేసుకున్నారు. రామానాయుడు స్టూడియో లాంటివి పరిశీలించారు. కానీ అవన్నీ బెంచ్ మార్క్ లాగా ఉండవన్న కారణం.. రుషికొండపై కొత్త నిర్మాణాలు చేయాలని సంకల్పించినట్లుగా చెబుతున్నారు. సీఎం జగన్ సతీమణి భారతి వీటి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారని అంటున్నారు. నిర్మాణ సమయంలో పలుమార్లు పరిశీలించారని అంటున్నారు.
ఇప్పుడు ఆమె పుట్టిన రోజుకు ముందు రోజే ఆ ఇంట్లో కాపురం ప్రారంభించాలని నిర్ణయించడంతో బార్యకు గిఫ్ట్ గా సీఎం జగన్ ప్రజాధనంతో ఈ ఇల్లు నిర్మించారన్న విమర్శలు రావడానికి అవకాశం ఏర్పడుతోంది. ఇప్పటికే దాదాపుగా ఐదు వందల కోట్లతో నిర్మించిన ఈ ఇల్లును ప్రైవేటుకు లీజుకు ఇచ్చేశారన్న ప్రచారం జరుగుతోంది. జగన్ రెడ్డి బినామీ కంపెనీ దీన్ని చేజిక్కించుకుదంని అంటున్నారు. వివరాలు బయటకు రావాల్సి ఉంది.