ముందస్తు ఎన్నికలు రావట్లేదు అని అడిగిన వారికీ.. అడగని వారికీ చెబుతున్నారు ఏపీ మంత్రులు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్కరూ ముందస్తు ఎన్నికలు రావని ఎప్పట్లాగే ఎన్నికలు 2024లో జరుగుతాయంటున్నారు. సీఎం జగన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేశారు. మే నుంచి గేరు మారు్తామని అందరూ రెడీగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు జగన్ కూడా ముందస్తు ఆలోచన చేస్తున్నారని కొంత కాలంగా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వనరుల సమీకరణ విషయంలో కఠఇనంగా వ్యవహరిస్తోంది. అప్పులు పుట్టకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ముందస్తుకు వెళ్లడం మంచిదన్న అభిప్రాయం వైసీపీలో కూడా ఉందంటున్నారు. ఒక వేళ తెలంగాణ రాష్ట్ర సమితి ముందస్తుకు వెళ్లకపోయినా… ఆ రాష్ట్రంలో వచ్చే ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణతోపాటే ఎన్నికలకు వెళ్లేఅవకాశం ఉందని భావిస్తున్నారు. విడివిడిగా ఎన్నికలు జరిగితే.. అధికార పార్టీకి నష్టమని.. తెలంగాణలో ప్రభుత్వం మారితే ఇబ్బంది పడాల్సి వస్తుందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది.
అందుకే జగన్ కూడా ముందస్తు ఆలోచనలో ఉన్నారని … నేతలందర్నీ ఆ దిశగా సమాయత్తం చేస్తున్నారని అంటున్నారు. గెలవడానికి అవసరమైన వనరులు కూడా తాను సమకూరుస్తానని చెప్పారంటే.. ఇప్పటికే అన్నీ రెడీ చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. అయితే ఏపీలో ముందస్తుపై పెద్దగా చర్చ జరగడంలేదు. అలా జరగాలన్న ఉద్దేశంతోనే మంత్రులు.. ముందస్తు లేదు.. ముందస్తు లేదుని అడగకపోయినా చెబుతున్నారని భావిస్తున్నరు.