కాబోయే మంత్రినంటూ ఫ్లెక్సీలు వేసుకున్న జగ్గయ్యపేట వైసీపీ అభ్యర్థికి… వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టి షాకే ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. లోటస్ పాండ్ కు పిలిచి… స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దానికి సాక్ష్యంగా… ఆయన తరపున.. జగ్గయ్యపేట నియోజకవర్గం మొత్తం వెలిసిన ఫెక్సీలు …రాత్రికి రాత్రే మారిపోయాయి. కాబోయే మంత్రివర్యులు .. అనే స్టేటస్ ను మార్చేసుకుని… వెంటనే… మాజీ ప్రభుత్వ విప్ అనే… హోదాతో…ఫ్లెక్సీలను రీప్లేస్ చేసేశారు. ఎక్కడికక్కడ ఈ మార్పు జగ్గయ్యపేటలో స్పష్టంగా కనిపించింది. దాంతో.. టీడీపీ నేతలే కాదు.. వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
వైసీపీ గెలుస్తుందన్న ప్రచారాన్ని.. ఆ పార్టీ శ్రేణులు ఓ రేంజ్ లో చేస్తున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా… మొదట్లో ఇది బెట్టింగ్లకు ఊతంలా మారింది. ఆ తర్వాత .. వైసీపీ నేతలు కంట్రోల్ ..కంట్రోల్ అనుకున్నా… పదవుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వారికి మాత్రం.. ఈ నిరీక్షణ తట్టుకోలేని విధంగా మారింది. అందుకే.. చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు.. జగన్ గెలుస్తాడు.. నేను మంత్రి అవబోతున్నా.. అని అనుచరులతో చెప్పుకుంటున్నారు. కొంత మంది అయితే.. ఫోర్ట్ ఫోలియోలు కూడా రెడీ చేసుకున్నారు. నాయకుడి ఉత్సాహం చూసి.. కార్యకర్తలకు కూడా హుషారొస్తోంది. అందుకే.. కాబోయే మంత్రి అనే పేరుతో.. ఫ్లెక్సీలు వేసి..పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అతిగా మారడంతో జగన్మోహన్ రెడ్డికీ చిరాకేసి పిలిచి చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది.
నిజానికి… పోలింగ్ ముగిసిన రోజు.. అంతా దేవుడి దయ అన్న జగన్మోహన్ రెడ్డి కూడా… తర్వాత చంద్రబాబు ఈవీఎంలపై పోరాటం ప్రారంభించడంతో.. కాన్ఫిడెన్స్ పెంచుకున్నారు. ప్రశాంత్ కిషోర్… నేమ్ ప్లేట్ కూడా చేసి ఇవ్వడంతో.. మరింత ఆనందం పొందారు. జగన్మోహన్ రెడ్డి ధీమా చూసిన నేతలు కూడా.. మరింత అడ్వాన్స్ అవుతున్నారు. అయితే… వారి ఉత్సాహంపై… పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చి… నీళ్లు చల్లుతున్న జగన్మోహన్ రెడ్డి తను మాత్రం.. వెనక్కి తగ్గడం లేదు. ఆయన టీం.. సెక్రటేరియట్లో గెలవబోతున్నామని.. చెప్పి..రకరకాల వ్యవహారాలు నడిపేస్తోందన్న ప్రచారం ఇప్పటికే ఉద్ధృతంగా సాగుతోంది.