కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా… ఏపీ సర్కార్ మాత్రం ప్రజలందరికీ ఉచిత టీకా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఏపీలో రెండు కోట్ల మందికిపైగా.. పద్దెనిమిదేళ్లకుపై బడిన ప్రజలు ఉన్నారు. వారందరికీ.. ఉచితంగా టీకా ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు.. మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం మూడో విడత వ్యాక్సినేషన్ లో పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ డోస్ ఇవ్వాలని నిర్ణయించడంతో.. ఆ మేరకు ఏపీ కూడా ప్రారంభించనుంది. వ్యాక్సిన్ డోసు ధర… రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. నాలుగు వందలకు ఇవ్వాలని కోవిషీల్డ్ నిర్ణయించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవాగ్దిన్ ధర మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే కేంద్రం ఉచితంగా ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. దీంతో చాలా రాష్ట్రాలు తాము ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటిస్తున్నాయి. ఆ కోవలోకి ఏపీ కూడా చేరింది.
వ్యాక్సిన్ సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకు.. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇవ్వడంతో… ఆయా సంస్థకు కాావాల్సిన టీకాలకు ఆర్డర్ పెట్టాలని అధికారను జగన్ ఆదేశించారు. సీఎం స్వయంగా… భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లాకు ఫోన్ చేశారు. ఏపీ కోసం అదనంగా వ్యాక్సిన్లు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే.. హెటెరో సంస్థ ఎండీకి కూడా ఫోన్ చేశారు. రెమిడెసివర్ ఇంజెక్షన్లు కూడా… అధికంగా ఎపీకి పంపిణీ చేయాలని కోరారు. అయితే ప్రస్తుతం రెమిడెసివర్ ఉత్పత్తులన్నింటినీ కేంద్రం తన పరిధిలోకి తీసుకుంది.
మరో వైపు ఏపీలో కరోనా కట్టడికి కొత్త చర్యలు తీసుకున్నారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలు.. నైట్ కర్ఫ్యూ విధించాయి. ప్రధానమంత్రి కూడా ముఖ్యమంత్రులతో జరిగిన సమీక్షా సమావేశంలో… నైట్ కర్ఫ్యూ విధించడం… మంచిదన ిసలహా ఇచ్చారు. ఏపీ సర్కార్ ఇప్పటికి నిర్ణయం తీసుకుంది.