ఓ వైపు మతపరమైన ఆరోపణలు వెల్లువెత్తుతూంటే.. వాటికి ఆజ్యం పోసేలా.. ఏపీ సర్కార్ నిర్ణయాలు ప్రకటిస్తోంది. తాజాగా జెరూసలెం పర్యటనకు వెళ్లేవారికి ఆర్థిక సాయం భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ. 3 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న వారు జెరూసలెం వెళ్లాలనుకుంటే….. రూ. 60 వేలు ప్రభుత్వం ఇస్తుంది. రూ. 3 లక్షల కంటే..ఎక్కువ ఆదాయం ఉన్నప్పటికీ.. రూ. 30 వేలు సాయం చేస్తారు. ముస్లింలకు హజ్ యాత్రకు వెళ్లడానికి హజ్ బోర్డు ద్వారా ప్రత్యేకంగా ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం చేస్తుంది. అయితే.. జెరూసలెం యాత్రకు మాత్రం.. పూర్తిగా ప్రజాధనాన్నే ఇస్తున్నారు. ఏకంగా రూ. అరవై వేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించడం వివాదానికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది.
హిందూ ఆలయాల్లో … భక్తుల సేవలను భారం చేస్తూ పోతున్న ప్రభుత్వం.. అదే క్రిస్టియన్ పుణ్యక్షేత్రం లాంటి జెరూసలెం వెళ్లేవారికి మాత్రం.. భారీగా ఆర్థిక సాయం చేస్తోంది. తిరుమల కొండపై ప్రభుత్వం ఇప్పటికే భక్తులపై అనేక రకాలుగా చార్జీలు బాదుతోంది. గదుల అద్దె.. ప్రత్యేక దర్శనం.. ఇలా అన్నింటినీ పెంచేశారు. కొత్త పలకమండళ్లను నియమించిన తర్వాత … ఇతర ఆలయాల్లోనూ అదే పరిస్థితి ఉంటుందంటున్నారు. మరో వైపు.. మంత్రులు.. హిందూ మతాన్ని, సంప్రదాయాలను అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారు. స్వయంగా.. మంత్రి కొడాలి నాని.. తిరుమలపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సర్కార్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వెనుక మత పరమైన కోణం ఉందన్న ఆరోపణలు అదే పనిగా వస్తున్నాయి. వాటిని డిఫెండ్ చేసుకోవడానికి వైసీపీ నేతలు.. ఆవేశపడుతున్నారు. అసభ్యంగా మాట్లాడి.. మరింత వివాదాలకు కారణం అవుతున్నారు. అయినప్పటికీ.. ఏపీ సర్కార్ వెనుకడుగు వేయడం లేదు. ఎవరేమనుకున్నా… తాను చేయాలనుకున్నది చేస్తోంది.