ఆంధ్రప్రదేశ్ నుంచి రోగులతో హైదరాబాద్ వెళ్తున్న అంబులెన్స్‌లను సరిహద్దుల్లో ఆపేయడంపై సీఎం జగన్ స్పందించలేదని అందరూ విమర్శించారు. అయితే సీఎం జగన్ ఆ అంశాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నారు. అప్పటికప్పుడు తెలంగాణ సర్కార్‌తో కొట్లాడటం కన్నా.. సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగోనాలని తీవ్రంగా ఆలోచించి.. పరిష్కారం కనుగొన్నారు. అదే.. ఏపీలోనే హైదరాబాద్ స్థాయిలో అదీ కూడా.. ప్రతీ జిల్లాలో మౌలిక వసతులు.. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను అందుబాటులోకి తేవడం.
అన్ని ప్రభుత్వం నిర్మించడం అసాధ్యం కాకుండా.. అన్ని జిల్లాల కేంద్రాలతో పాటు మూడు పెద్ద నగరాల్లో ప్రత్యేకంగా హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో హెల్త్ హబ్ ముఫ్పై నుంచి యాభై ఎకరాల్లో ఉంటుంది. హెల్త్ హబ్‌లో ఆస్పత్రులు పెట్టాలనుకునేవారికి .. ఒక్కో ఆస్పత్రికి ఐదు ఎకరాల చొప్పున కేటాయిస్తారు. ఇలా ఆస్పత్రులు పెట్టేవారు.. మూడేళ్లకు వంద కోట్ల వరకూ ఆస్పత్రులపై పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వెంటనే భూసేకరణ జరపాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలు.. అమల్లోకి వస్తే.. వచ్చే మూడేళ్లలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ… కనీసం నాలుగైదు.. అపోలో తరహా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయి.
అప్పుడు ప్రజలు ఖరీదైన వైద్యం కోసం… హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉండదు . ఆ మాటకొస్తే.. జిల్లా దాటి పోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా.. ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాటికి.. ఇవి తోడయితే.. ఏపీ మెడికల్ హబ్‌గా మారుతుంది. ముఖ్యమంత్రి జగన్ ముందు చూపు.. అధికారుల్ని కూడా అబ్బురపరిచింది.