వాలంటీర్ల మద్దతు ఉంటే చాలా గెలిచేస్తానన్నట్లుగా ఊపులో ఉన్న సీఎం జగన్ వారికి రాజకీయ అవకాశాలు కల్పిస్తానని నేరుగానే ప్రకటించారు. దీంతో రెండున్నర లక్షల మంది వాలంటీర్లలో ఆశలు చిగురిస్తున్నాయి. ఇద్దరు, ముగ్గురికి అయినా అసెంబ్లీ టిక్కెట్లు ఇస్తారేమోనన్న అభిప్రాయం వినిపిస్తోంది. సీఎం జగన్ ఈ మేరకు కసరత్తు చేసిన తర్వాతే రాజకీయ అవకాశాల గురించి ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు.
వైసీపీ రాజకీయ వ్యూహంలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. రిజర్వుడు నియోజకవర్గాల్లో రెడ్డి సామాజికవర్గం వారిని ఇంచార్జులుగా పెడతారు. అక్కడ డమ్మీ అబ్యర్థుల్ని నిలబెడతారు. ఎవరు గెలిచినా రెడ్డి సామాజికవర్గ ఇంచార్జ్ మాత్రమే అనధికారిక ఎమ్మెల్యే అవుతారు. అలాంటి నియోజకవర్గాలను రెండు, మూడింటిని ఇప్పటికే ఐడెంటిఫై చేశారని అక్కడ వాలంటీర్ల ముద్ర వేసి.. పార్టీ నేతలకు టిక్కెట్లు ఇచ్చేందుకు రెడీ చేశారని అంటున్నారు. ముఖ్యంగా ఇవన్నీ రాయలసీమలోనే ఉన్నాయని చెబుతున్నారు.
పార్టీ క్యాడర్ కన్నా వాలంటీర్లే కీలకంగా జగన్ భావిస్తున్నందున ఇక నుంచి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు .. ఇతర ఎన్నికల్లో వైసీపీతరున నిలబడేందుకు వాలంటీర్లకే ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉందంటున్నారు. అన్నీ వాలంటీర్లకు ఇస్తే.. తాము ఎందుకని కింది స్థాయిక్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. సీఎం మాత్రం.. అసలు పార్టీ క్యాడర్ కన్నా వాలంటీర్లే ముఖ్యమని అనుకుంటున్నట్లుగా వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.