న్యాయవ్యవస్థతో ఈగోలకు పోయిన జగన్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. దిగువకోర్టుకు వెళ్లి పూచికత్తు సమర్పించకుండానే ఆయన హైకోర్టుకు వెళ్లి.. ఆ దిగువ కోర్టు ఉత్తర్వుల్ని కొట్టివేయించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి కె.శ్రీనివసారెడ్డి దిగువకోర్టు ఉత్తర్వుల్ని కొట్టి వేసి జగన్ కు పదేళ్ల పాస్ పోర్టు జారీ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. దాంతో జగన్ దంపతులు లండన్ పయనమవుతున్నారు.
గత ఆరేడేళ్ల నుంచి ఫ్రాన్స్, లండన్లలో కాలేజీల్లో చదువుతున్న జగన్ కుమార్తె గ్రాడ్యూయేషన్ డేకి ఆయన హాజరు కానున్నారు. నిజానికి పుట్టిన రోజుకే వెళ్లాలనుకున్నారు కానీ..కింది కోర్టులో పూచికత్తు ఇవ్వడం ఇష్టం లేక ఆగిపోయారు. ఇప్పుడు హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని వెళ్తున్నారు. అయితే ఐదేళ్ల కాలానికి పాస్ పోర్టు కావాలని ఎందుకు పట్టుబట్టారన్నది అర్థం కాని విషయం. ఎంత కాలం ఉన్నా.. ఆయన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ పాస్ పోర్టును కోర్టులో సబ్మిట్ చేయాల్సిందే. కానీ ఈ సారి మాత్రం పదేళ్ల కాలానికి పాస్ పోర్టు పట్టుబట్టి మరీ తీసుకుని వెళ్తున్నారు.
జగన్ లండన్ వెళ్లి తిరిగి రాకపోతే సీబీఐ, ఈడీ కూడా ఏమీ చేయలేవు. ఇప్పటికే అక్కడ బిగ్ షాట్స్ తలదాచుకున్నారు. విజయ్ మాల్యా, నిరవ్ మోదీ లాంటి వాళ్లు లండన్ లోనే సెటిలయ్యారు. వారిని తీసుకు రావడం భారత ప్రభుత్వం వల్ల కూడా కావడం లేదు. విజయ్ మల్యాకు.. జగన్ కు దగ్గర సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. అసలే ఏపీలో ప్రతిపక్ష హోదా లేదు. వివేకా హత్య కేసు సహా చాలా వరకూ కేసులు చుట్టుముట్టే ప్రమాదం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన కొంత కాలం లండన్ లో ఉండిపోయి.. ప్రవాస రాజకీయం చేసినా ఆశ్చర్యం లేదన్న వాదన ఉంది. నిజంగా అలా చేస్తే వైసీపీ నిర్వీర్యం అయిపోయి షర్మిల ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.