30 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటాను కాబట్టి ఇక ఎన్నికలు ఎందుకంటూ చాన్స్ వస్తే శాశ్వత ముఖ్యమంత్రిగా ప్రకటించుకుంటూ జీవో జారీ చేసుకుంటారని ఏపీ సీఎం జగన్పై రాజకీయవర్గాల్లో చాలా కాలంగా సెటైర్లు ఉన్నాయి. ఇవి సెటైర్లు కాదని తాజాగా కొన్ని పరిణామాలతో తెలిసిపోతోంది. ఎలాగూ తానే గెలుస్తాను కాబట్టి ఇక పార్టీకి ప్రత్యేకంగా సంస్థాగత ఎన్నికలు ఎందుకు అని డిసైడ్ అయ్యారు. పార్టీ ప్లీనరీలో పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. దాని ప్రకారం ఇక వైఎస్ఆర్సీపీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఉంటారు. అంటే భవిష్యత్లో అధ్యక్ష ఎన్నికల్లాంటివేమీ ఉండవన్నమాట.
సాధారణంగా ఇక కింది స్థాయి నాయకత్వాన్ని అంటే జిల్లా అధ్యక్షులు..కార్యదర్శలు.. ఇతర పదవుల్ని పార్టీ అధినేతనే భర్తీ చేస్తారు కాబట్టి సంస్థాగత ఎన్నికలు కూడా ఉండవన్నమాట. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు ఇలా శాశ్వత అధ్యక్షుడిగా నియమించుకోవడం సాధ్యమేనా లేదా అన్నది ఈసీ తేల్చాలి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో తిరిగులేని మద్దతు ఉంది కాబట్టి ఆయనేం చేసినా వర్కవుట్ అయిపోతోంది.
ఆ ప్రకారం ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. ఇలాంటి అవకాశం ఏ మాత్రం దొరికినా అంటే గెలిచేది తానే అని ట్రంప్ తరహాలో ప్రకటించుకుని.. గెలవకపోతే అక్రమాలు జరిగినట్లేనని తేల్చి… ఆ అక్రమాలు జరగకుండా తనకు తానే శాశ్వత ముఖ్యమంత్రిగా ప్రకటించుకుంటున్నానని ఎప్పుడైనా జీవో జారీ చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఏపీలో ఇప్పటి వరకూ అలాంటి ఆశ్చర్యపోయే ఎన్నో జీవోలు విడుదలయ్యాయి. విడుదలవకపోతేనే ఆశ్చర్యం .